Agent: బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తోంది. పెద్ద చిన్న అందరు హీరోలు ఒక్కొక్కరుగా వారి సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా అడుగుపెట్టిన అఖిల్.. కెరీర్ పరంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ అనే సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అఖిల్ ఒక రక్షణ విభాగానికి చెందిన పవర్ ఫుల్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఫుల్ లెన్త్ భారీ యాక్షన్ మూవీగా ఏజెంట్ తెరకెక్కుస్తున్నట్లు టీజర్ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మరి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించగా, సురేందర్ రెడ్డి కూడా నిర్మాణంలో భాగమవ్వడం విశేషం. మరి ఏజెంట్ మూవీ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.