హిట్ సినిమాలే నెలలోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ప్రేక్షకులు తిరస్కరించిన 'ఏజెంట్' మాత్రం ఆలస్యం చేస్తోంది. ఆ కారణం వల్లే ఇలా జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు.
అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ చాలా ఘోరంగా ఫెయిలైంది. స్వయంగా హీరో, నిర్మాత దీన్ని ఒప్పుకొన్నారు. అఫీషియల్ గా లెటర్స్ కూడా రిలీజ్ చేశారు. అదే టైంలో రిలీజైన మూడు నాలుగు రోజుల్లోనే ఓటీటీ విడుదల గురించి న్యూస్ బయటకొచ్చేసింది. సరేలే థియేటర్లలో అంటే కష్టం.. ఓటీటీలో అయినా చూసేయొచ్చని ఆడియెన్స్ అనుకున్నారు. ఇప్పుడు ఆ రిలీజ్ ని కూడా గత రెండు వారాల నుంచి వాయిదా వేస్తూనే ఉన్నారు. ఆ ఒక్క కారణం వల్లే ఇలా చేస్తున్నారని ఇప్పుడు సరికొత్త న్యూస్ బయటకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటివరకు 5 సినిమాలు చేశాడు. వాటిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ యావరేజ్ అనిపించుకుంది కానీ మిగతావన్నీ దారుణమైన రిజల్ట్స్ అందుకున్నాయి. ఏప్రిల్ చివర్లో వచ్చిన ‘ఏజెంట్’పై అఖిల్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నాడు. కానీ కంటెంట్ ఏ మాత్రం సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. థియేటర్లలో ఈ మూవీ వచ్చిన కొన్ని రోజులకు అఖిల్ ఓ లెటర్ రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అందరికీ అర్థమైపోయింది.
ఇది పక్కనబెడితే ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ మే 19న సోనీలివ్ లో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు కొత్త తేదీని ప్రకటించలేదు. ఆల్రెడీ థియేటర్లలో సినిమా వల్ల తనకు నష్టం జరిగిందని భావించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. ఓటీటీలో రిలీజైతే మరింత నష్టం జరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాడట. అందుకే కొన్ని సీన్లు ఎడిట్ చేసి ఓటీటీలో ‘ఏజెంట్’ని రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని సమాచారం. అందుకే ఇంత లేటు అవుతోందని మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఎంతనిజం ఉందనే ‘ఏజెంట్’ ఓటీటీలో విడుదలైతే గానీ తెలియదు. మరి ఈ మూవీ ఆలస్యానికి రీజన్ ఏమై ఉండొచ్చని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.