అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్క హిట్ రావట్లేదు అక్కినేని వారసుడికి. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినవే కానీ ఏం ఉపయోగం ఒక్కటి సరైన హిట్ లేదు.
ఎంత మంది డైరెక్టర్లు ట్రై చేసిన అఖిల్‌కి మాత్రం బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోతున్నారు. కథల ఎంపికలో పొరపాటు చేస్తున్నాడా.. లేక డైరెక్టర్స్ సరిగ్గా తీయలేక పోతున్నారా.. ఇలా చాలా సందేహాలు కలుగుతున్నాయి.కొందరు అయితే అఖిల్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. క్రికెట్ మీద దృష్టి పెట్టడం మంచిది అంటున్నారు మరి కొందరు నెటిజన్లు. మనోడు క్రికెట్‌లో ఇరగదిస్తాడు అది వేరే విషయం అనుకోండి. ఇకపోతే రీసెంట్‌గా వచ్చిన అఖిల్ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో మనోడి కెరీర్ రిస్క్‌లో పడినట్లయింది. ఇది ఇలాగే కొనసాగితే.. అఖిల్ సినిమాలకు గుడ్ బై చెప్పక తప్పదు. అఖిల్ కెరీర్‌లో ఎదైనా చెప్పుకోదగ్గ సినిమా ఉందంటే అది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అని చెప్పాలి. అయితే తాజాగా అఖిల్ కోసం ఓ మంచి కథ రెడీ చేసి తీసుకొచ్చారట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.
ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ‘పెద కాపు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయినవెంటనే అఖిల్‌తో మూవీ మొదలుపెట్టనున్నాడని సినీ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్. ఒక పవర్ పుల్ కథ సిద్దం చేశాడట శ్రీకాంత్ అడ్డాల. అది మాస్ యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది. దానికోసం అఖిల్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్టు నెట్టింట చర్చించుకుంటున్నారు. శ్రీకాంత్ ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలు చేయలేదు. తనదంతా ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ సినిమాలే.. మరి యాక్షన్ కథను తీయగలడా అని కొందరు సందేహ పడుతున్నారు. ఎలగైనా అఖిల్‌కు ఒక మంచి హిట్ సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. కథల విషయంలో దిల్ రాజుకు మంచి అనుభవం ఉంది. తనకు కథ నచ్చిందంటే సినిమా 50 శాతం హిట్ అయినట్టే.. చూడాలి మరి అఖిల్.. ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్‌లోకి వస్తాడా అని. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ అఖిల్‌కు సూపర్ హిట్ ఇవ్వలేకపోయాడు. శ్రీకాంత్ అడ్డాల అయిన అఖిల్‌కి బ్లాక్ బస్టర్ ఇస్తాడెమో చూడాలి. ఫ్యాన్స్ అయితే తమ హీరోకి ఒక ఇండ్రస్టీ హిట్ కావాలంటు కోరుకుంటున్నారు.