టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కినేని అఖిల్ కు హిట్టు అందుకోవడానికి చాలా సమయమే పట్టింది. అన్నీ యావరేజ్ టాకుతో సరిపెట్టుకున్నా కూడా. ‘మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్’ మాత్రం హిట్టు కొట్టి అఖిల్ లో జోష్ పెంచింది. ఏజెంట్ సినిమా, అఖిల్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. సినిమా కోసం అఖిల్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.
అఖిల్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి తనేంటో ప్రూవ్ చేసేందుకు సురేందర్ రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. ఈ సినిమాలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే లుక్ విషయంలో కూడా చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. రిలీజ్ రివీల్ చేస్తూ ఓ క్రేజీ పోస్టర్ ను విడుదల చేశారు.
ఆ పోస్టర్ లో ఓ ఫైట్ మధ్యలో పెద్ద మెషిన్ గన్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న అఖిల్ ను చూపించారు. ఈ పోస్టర్ తోనే సురేందర్ రెడ్డి ఈ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేస్తున్నాడు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏజెంట్ సినిమాతో అఖిల్ కు యాక్షన్ హీరో అయిపోతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.