సినీ ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం మామూలే. కానీ ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ఎవరి కెరీర్ వారి చేతుల్లోనే ఉంటుంది. నటిగా, నటుడిగా నిలబడాలంటే తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటే సరిపోదు. టాలెంట్‌తోనే పైకి రావాలి. కొత్తవాళ్ళకైనా, ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చిన వారికైనా ఇదే వర్తిస్తుంది. ఇక స్టార్ కిడ్స్‌లో చాలా కొద్ది మంది మాత్రమే తల్లిదండ్రుల పేర్లు, పలుకుబడి ఉపయోగించకుండా ఎదిగి చూపించాలనే కసితో ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే.. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. ప్రస్తుతం చోర్ బజార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో హాజరైన ఆకాష్.. ఇప్పటివరకూ తన వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్ లో జరిగిన మంచి విషయాలు, ఎదుర్కొన్న చేదు విషయాలను షేర్ చేసుకున్నాడు.
‘ఓసారి ఏమైందంటే నేను నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక్కసారి చూద్దామని నాన్న గోడ మీద నుంచి ఎగిరెగిరి చూస్తుంటే అక్కడున్న సెక్యూరిటీ తనని లాగిపెట్టి కొట్టి వెళ్లిపోమన్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్నావు, పార్ట్ టైం జాబ్ చూశాను, చేయమన్నారు నాన్న. అలా జిమ్‌కు వెళ్లి క్లీనింగ్ చేశా. ఆర్థిక సమస్యలతో ఇక్కడ జాబ్ చేస్తున్నానన్నాను. కానీ వారికి నేను పూరీ కొడుకు అని తెలిసిపోయింది’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: పూరి – ఛార్మి రిలేషన్ పై ఆకాశ్ పూరి ఓపెన్ కామెంట్స్!
‘‘ఆంధ్రావాలాలో నాకు పాత్ర ఫిక్సయిపోయింది. సడన్‌గా ఫోన్ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు. నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఫీలయ్యాను. ఓసారి మార్కెట్‌లో లయన్ కింగ్ సీడీని దొంగిలించి ఎవరికీ కనిపించకుండా జేబులో పెట్టుకుని వచ్చేశాను. ఇక సినిమాల విషయానికి వస్తే పూరీ కొడుకు.. పూరీ కొడుకు, స్టార్‌డమ్ ఉన్న వాళ్ల నాన్న ఉన్నాడు, వాడికేంటిలే అనే టాక్ బయట బాగా ఎక్కువైపోయింది. అందుకే నాన్న నాతో సినిమా చేద్దాం అన్నా కూడా నో చెప్పాను. పూరీ కొడుకు అనేది పోగొట్టుకున్నాకే నీతో సినిమా చేస్తానని చెప్పాను’ అని పేర్కొన్నాడు ఆకాష్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ తో రొమాంటిక్ మూవీ టీమ్ ఫన్నీ చిట్ చాట్! ప్రభాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!