తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన నటనతోనే కాదు.. వ్యక్తిత్వంతోనూ ఎంతో మందిని అభిమానులుగా చేసుకున్నారు. ఎంత పెద్ద స్టార్ హోదా ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అజిత్ కుమార్. అజిత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే తన బైక్ పై ఇడియాలో ఉన్న చాలా ప్రదేశాలను చుట్టేశాడు. ఇప్పుడు అజిత్ బైక్ యాత్ర యూకేకి చేరుకుంది.
యునైటెడ్ కింగ్ డమ్లోని చాలా క్లిష్టతరమైన ప్రదేశాల్లో అజిత్ తన బైక్ పై ఓ టూర్ వేస్తున్నాడు. అయితే ప్రస్తుతం అజిత్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్ లండన్ లోని ఓ డిపార్టుమెంటల్ స్టోర్ కి వెళ్లాడు. అక్కడ స్టోర్ యజమాని అజిత్ ని గుర్తుపట్టి పలకరించగా.. అతనితో మాట కలిపాడు. అతని యోగక్షేమాలు అడిగితెలుసుకున్నాడు.
Recent pic of ajith kumar…❤#AjithKumar #jayatv pic.twitter.com/OAUhz3c220
— Jaya TV (@JayaTvOfficial) June 25, 2022
అజిత్ స్టోర్ లోకి వచ్చింది, వెళ్లింది ఆ సీసీటీవీలో రికార్డు అయ్యింది ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలో అజిత్ బ్లాక్ సూట్లో ఉన్నాడు. కానీ అజిత్ కి బాగా పొట్ట వచ్చేసి, లావుగా కనిపిస్తున్నాడు. అజిత్ లుక్ చూసి ఫ్యాన్స్ కూడా షాకవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ అవుతోంది.
Ajith Kumar’s Latest pic from the bike ride 🤩💥#AjithKumar #AjithKumarTrip #AK #AK61 pic.twitter.com/fsEIoAEnga
— IndiaGlitz – Tamil (@igtamil) June 20, 2022
సినిమాల విషయానికి వస్తే అజిత్ కుమార్ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో వలిమై సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. మళ్లీ వలిమై డైరెక్టర్ వినోద్ తోనే ‘AK 61’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం హాలిడేని ఎంజాయ్ చేస్తున్న అజిత్.. త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. అంతేకాకుండా AK 61 టైటిల్, ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. అజిత్ రీసెంట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ajith sir in London.
| Video: Yathees | @arianoarun | #Ak #Ajith #AjithKumar | #Ak61 | pic.twitter.com/qKGjtfa4Xy
— Ajith (@ajithFC) July 4, 2022