అన్వేషీ జైన్.. నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా ఆమెకు ఎంతో పాపులారిటీ, ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం రవితేజ నిటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీసా అనే స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అయితే ఎంతో హుషారుగా కనిపించే అన్వేషీ జైన్ జీవితంలో అంతులేని కష్టాలు ఉన్నాయి. ఎన్నో అవరోధాలను దాటి వచ్చాకే ఆమెకు ఇప్పుడు ఈ పాపులారిటీ, ఫాలోయింగ్ దక్కాయి. అసలు ఆమె జీవితంలో అనుభవించిన కష్టాలు ఎంటో తెలుసుకోండి. అన్వేషీ జైన్ 1991 జూన్ 1న మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో జన్మించింది. ఎంతో మంది ఆడపిల్లల్లా తాను కూడా చిన్నప్పుడే వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. చాలా మంది తన శరీరాన్ని చూసి చాలా మంది దుర్భాషలాడేవారని తెలిపింది. కానీ, ఆ వయసులే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా ఉండిపోయానన్నారు. ఆ తర్వాత పదో తరగతిలో ట్యూషన్ చెప్పమని ఓ ఉపాధ్యాయుడిని పెడితే.. అతను నిన్ను ఎక్కడ పట్టుకోవాలి అంటూ ప్రశ్నించినట్లు తెలిపింది. కానీ, అతను పేదవాడు కాబట్టి.. అతని కుటుంబం గురించి ఆలోచించి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) భోపాల్ లోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అన్వేషీ జైన్.. సినిమాల వైపు అడుగులు వేసింది. మొదట్లో కొన్ని ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరించింది. ఓసారి ఈవెంట్ చేస్తుండగా తన ఫ్రెండ్ ఎన్నోసార్లు కాల్ చేసింది. కానీ, ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత లిఫ్ట్ చేయగా తన ఇల్లు కాలిపోయిందని చెప్పారన్నారు. తన ఖాతాలో ఉన్న 850 డ్రా చేసుకుని ఇంటికి వెళ్లా. నేను సాధించాల్సింది ఇంకా ఏదో ఉంది అని భావించి ఇల్లు విడిచి ముంబై వెళ్లిపోయానన్నారు. View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) "ముంబైలో నేను బొద్దుగా ఉన్నానని దాదాపు 700 ఆడిషన్లు రిజెక్ట్ చేశారు. చాలా బాధ పడ్డాను ఆ తర్వాత తేరుకుని అసలు విషయం తెలుసుకున్నాను. ఈ గ్యాప్ లో నాకు లవ్ ఫెయిల్యూర్ కూడా జరిగింది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మాయలో పడి మోసపోయాను. మానసిక సమస్యలకు గురయ్యాను. ఆ తర్వాత నా అనుభవాలతో వీడియో బ్లాగింగ్ చేయడం ప్రారంభించాను. అలా ఫేస్ బుక్ లో ఫేమస్ అయ్యాను. తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ డైరెక్టర్ బాలాజీ సింగ్ కాల్ చేసి.. నాకు తన వెబ్ సిరీస్ లో అవకాశం ఇస్తానన్నారు. అలా గందీ బాత్ 2లో నటించాను. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి." View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) అంతేకాకుండా అన్వేషీ జైన్ ఓ అంతుచిక్కని, నయంకాని వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. తన రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్లు 2012లో తెలసుకున్నానన్నారు. ఆ తర్వాత అది రెండో భాగానికి కూడా వ్యాపించే అవకాశం ఉందన్నారు. అప్పట్నుంచి ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి వైద్యులను సంప్రదిస్తూ క్యాన్సర్ కణాలు ఏమైనా వృద్ధి చెందాయేమో పరీక్ష చేయించుకుంటూ ఉన్నానన్నారు. కానీ, అది తన శరీర సమస్య అని తెలియక ఎంతో మంది తనను కామెంట్ చేస్తుంటారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలా అన్వేషీ జైన్ తన జీవితంలోని ఎన్నో చీకటి రోజులు, జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకుంది. అన్వేషీ జైన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.