టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన హీరో నాగశౌర్య.. మొత్తానికి ఓ ఇంటి వాడయ్యాడు. ప్రేమించిన నెచ్చెలి అనూష శెట్టి మెడలో తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం అతిథులకు బ్రహ్మండమైన విందు.. అది కూడా రాజుల కాలం నాటి పద్దతిలో ఏర్పాటు చేసి.. అందరి మనసు గెలుచుకున్నాడు నాగశౌర్య. అయితే వివాహానికి నాలుగైదు రోజుల ముందే నాగశౌర్య అనారోగ్యం పాలవ్వడం అందరికి తెలిసిందే. కానీ పెళ్లి నాటికి కోలుకుని.. ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అయితే టాలీవుడ్ నుంచి ప్రముఖులు ఎవరు ఈ వివాహానికి హాజరయినట్లు లేదు. మరి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారో ఏమో తెలియదు.
ఇక నాగశౌర్య వివాహం చేసుకున్న.. అనూష శెట్టి బెంగళూరులో ఒక ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ నడుపుతోంది. కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరికి పరిచయం వీరిద్దరికి పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత స్నేహం.. ఆపై ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు తమ ప్రేమ గురించి పెద్దలకు తెలియజేసి.. వారి అంగీకరంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇడు జోడు బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.. వీరిని చూసిన వాళ్లు.
తాజాగా వివాహ సందర్భంగా నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడు అనే దాని గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి సందర్భంగా నాగశౌర్యకు భారీగా కట్నకానుకలు అందాయని సమాచారం. ఇక అనూష శెట్టి స్వగ్రామం మంగళూరు దగ్గరలోని కుందాపుర. అనూష తండ్రి ఆమె చిన్నప్పుడే బెంగళూరు వచ్చి అక్కడే వ్యాపారాలు చేస్తూ సెటిలయినట్లు సమాచారం. బిజినెస్‌లో విజయం సాధించి.. కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా అనూష తండ్రి పలు వ్యాపారాలు చేస్తున్నారట. అలానే అనూష శెట్టి ఇంటీరియర్ వ్యాపారం కూడా కోట్లలో టర్నోవర్ ఉంటుందని తెలుస్తోంది.
ఇక వివాహం సందర్భంగా నాగశౌర్యకు నగదు రూపంగా ఎలాంటి కట్నం ఇవ్వలేదు కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులను.. నాగశౌర్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలా వచ్చిన ఆస్తుల విలువ సుమారు 50 నుంచి 80 కోట్ల దాకా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనేది.. నాగశౌర్య దంపతులకే తెలియాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతానికి నాగశౌర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తప్పనిసరిగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.