ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందిన వారి చిన్ననాటి ఫోటోలు నిమిషాల వ్యవధిలో నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం.. తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుని.. మరోసారి బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు షేర్ చేసే చైల్డ్‌హుడ్ ఫోటోలు చూస్తుంటే.. అస్సలు పోల్చుకోవడం కష్టంగా ఉంటుంది.. వెంటనే వారు ఫలనా అని గుర్తు పట్టలేం కూడా. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. పింక్ డ్రెస్‌లో అమాయకంగా చూస్తూ.. క్యూట్ లుక్స్‌తో చూడగానే తెగ ముద్దొచ్చేస్తుంది. అయితే ఆ చిన్నారి ఫోటో చూడగానే పోల్చుకోవడం కాస్త కష్టంగానే ఉంది. మరి ఇంతకు ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో మీరు గుర్తు పట్టారా లేదా..
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. టాలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. అందమైన రూపంతో పాటు.. అద్భుతమైన నటన కూడా ఆమె సొంతం. మరి ఇంతకు ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా లేదా.. అయితే ఆ చిన్నారి.. క్రేజీ హీరోయిన్ అదితిరావు హైదరీ. చెలియా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత సమ్మోహనం, వీ, అంతరిక్షం, మహాసముద్రం చిత్రాల్లో నటించింది.
ఇక అదితిరావు బ్యాగ్రౌండ్ మాములూగా లేదు. ఆమె తల్లిదండ్రులిద్దరూ రాజ కుటుంబాలకు చెందిన వారే. అంతేకాక ఆమె తెలుగు మూలాలున్న నటి. అదితిరావు తండ్రి అస్సాంకు చెందిన మహ్మద్ సలెహ్ అక్బర్ హైదరీ రాజ కుటుంబంలో జన్మించగా.. ఆమె తల్లి విద్యారావు.. వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు. అదితి అక్బర్ హైదరి మునిమనుమరాలు ఈ హీరోయిన్. ప్రస్తుతం నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాల్లో నటిస్తోంది అదితి రావు హైదరీ. ఇక అక్టోబర్ 28న ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు.
ఇక బర్త్‌డే సందర్భంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది అదితిరావు హైదరీ. ఈ అమ్ముడు హీరో సిద్ధార్థ్‌తో లవ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు ఈ స్టార్ కపుల్. అదితి పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెకు విషెస్ చెబుతూ.. ఇద్దరు కలిసి క్లోజ్‌గా దిని ఫోటోని షేర్ చేశాడు. దాంతో పాటు.. హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అంటూ రాసిన క్యాప్షన్‌తో వారిద్దరి మధ్య బంధాన్ని ఒపెన్‌గా ఒప్పుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. ప్రస్తుతం ఈ ఫోటోతో పాటు.. అదితిరావు చైల్డ్‌హుడ్ పిక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.