గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రమాదాల సంఖ్యను అరికట్టలేకపోతున్నారు. కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం ఇందుకు కారణం అని అధికారులు అంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రమాదానికి గురయ్యారు. ఓ ఆలయానికి వెళ్తుండగా దురదృష్టవశాత్తు ఈఘటన జరిగింది. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, అందుకే ప్రమాదం జరిగిందని నటి వివరించారు. స్వల్ప గాయాలతోనే బయటపడ్డట్లు స్పష్టం చేశారు.
ఓ ఆలయానికి వెళ్తున్న సమయంలో అనుకోకుండా కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో పక్కకు దారి మల్లించడంతో ప్రమాదం జరిగిందని తనుశ్రీ దత్తా తెలిపారు. తన జీవితంలో ఇదే మొదటి ప్రమాదం అని.. ఎప్పుడూ జరగలేదని అన్నారు. తన కాలికి గాయం అయినప్పటికీ ఆలయానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. తన కాలికి గాయం అయిన పిక్స్ సోషల్ మీడియాలో షేరు చేశారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు తనూ శ్రీ దత్తా. గతంలో బాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది నటి తనుశ్రీ దత్తా.
గతంలో తనూశ్రీ దత్తా బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పెద్ద రచ్చచేశారు. అ అదే విధంగా వివేక్ అగ్నిహోత్రి, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ వివాదాలపై ఆమెకు కొందరు మద్దతుగా నిలవగా మరి కొందరు ఈ వివాదంపై సరిగ్గా స్పందించడం లేదు.
ఇది చదవండి: Vishwak Sen- Devi Nagavalli: ముదురుతున్న విశ్వక్ సేన్- దేవీ నాగవల్లి వివాదం!