సినిమా హీరోయిన్స్ కంటే సీరియల్ నటులే జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. యాక్టింగ్ విషయంలో అయితే కాదండోయ్.. వ్యక్తిగత జీవితంలో అప్పుడప్పుడు సీరియల్ నటులే ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇటీవల ఓ సీరియల్ నటి.. తన ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా?
కొన్నిసార్లు సినిమా హీరోయిన్స్ కంటే సీరియల్ నటులే జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. యాక్టింగ్ విషయంలో అయితే కాదండోయ్.. అదేంటీ! సీరియల్ యాక్టర్ అన్నారు.. పైగా యాక్టింగ్ విషయంలో కాదంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనంటే.. వ్యక్తిగత జీవితంలో అప్పుడప్పుడు సీరియల్ నటులే ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇటీవల ఓ సీరియల్ నటి.. తన ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా? సాధారణంగా నటన రంగంలో కొన్నేళ్లుగా రాణించి.. ఓ వయసుకు వచ్చాక సొంతంగా లైఫ్ కి ఏమేం కావాలో ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటుంటారు. ఈ బ్యూటీ కూడా అదే పని చేసింది. కానీ.. ఆశ్చర్యపరుస్తూ టీనేజ్ లోనే ముంబైలో ఇల్లు కొనేసింది.
అవునా.. అని అనిపించవచ్చు. కేవలం 19 ఏళ్ళకే ముంబై నగరంలో ఇల్లు కొనుగోలు చేయడమంటే చిన్న విషయం కాదు. మనం ముంబై గురించి మాట్లాడుకుంటేనే ముందుగా ముంబైలో ఖర్చులు, లైఫ్ చర్చల్లోకి వస్తాయి. కానీ.. ఈ టీనేజ్ బ్యూటీ ఏకంగా లగ్జరీ ఇల్లు కొనడమే కాకుండా.. సొంత ఖర్చులతో దాన్ని తన ఇష్టాలకు అనుగుణంగా మెరుగులు దిద్దుకుంటోంది. సుంబుల్ టోఖిర్ ఖాన్.. ఈ పేరు తెలుగు వాళ్ళు ఎప్పుడు విని ఉండరు. కానీ.. హిందీలో బిగ్ బాస్ షోని చూసేవారికి ఈమె కాస్త సుపరిచితమే. బిగ్ బాస్ 16వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సుంబుల్.. షో నుండి బయటికి వచ్చేలోపు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఇక మధ్యప్రదేశ్ లోని కాట్ని ప్రాంతంలో పుట్టిపెరిగిన సుంబుల్ అసలు పేరు.. ఎజా టోఖీర్ ఖాన్. బాలీవుడ్ లో ఇమ్లీ, ఇషారోన్ ఇషారోన్ మే, చంద్రగుప్త మౌర్య లాంటి సీరియల్స్ ద్వారా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అదే సమయంలో బిగ్ బాస్ లో అవకాశం రావడంతో పార్టిసిపేట్ చేసి.. ఆడియెన్స్ కి మరింత దగ్గరవడమే కాకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. అయితే.. ముంబైలో కొత్త ఇల్లు కొన్న విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా చెబుతూ.. ఇంటీరియర్ డిజైనింగ్ కి ఏవైనా కొత్త ఐడియాలు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ని కోరింది. ప్రస్తుతానికి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. సుంబుల్ ‘ఆర్టికల్ 15’ మూవీలో నటించింది. ప్రస్తుతం.. సీరియల్స్ తో పాటు డియర్ ఇష్క్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం.