చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో ప్రతీ ఒక్కరి చూపు సెలబ్రిటీల మీదే ఉంటుంది. వారు ఏ చిన్న పని చేసినా అది క్షణాల్లో ప్రపంచం మెుత్తం వ్యాపిస్తుంది. కానీ వారికంటూ కొన్ని వ్యక్తి గత విషయాలు ఉంటాయి వాటిని తెలుసుకుని నిజాలు రాయండి అంటూ ఓ బాలీవుడ్ నటి తన కోపాన్ని, ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
తాజాగా నిర్మాత దిల్ రాజు మీడియా మీద ఫైర్ అయిన విషయం తెలిసిందే. నిజాలు ఏంటో తెలుసుకుని రాయాలని ఆయన వారికి సూచించారు. తాజాగా ఇలాంటి అనుభవమే మీడియా నుంచి బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ కు ఎదురైంది. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన జంట షెహనాజ్– సిద్ధార్థ్ శుక్లా. అప్పట్లో ఈ జోడీ క్రేజ్ మాములుగా ఉండేది కాదు. అయితే దురదృష్టవ శాత్తు సిద్ధార్థ్ చనిపోవడంతో షెహనాజ్ తీవ్రంగా కుంగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుని తన వర్క్ లో బిజీ అయ్యింది.
ఈ నేపథ్యంలోనే ఆమె టీవీ యాంకర్, డ్యాన్స్ మాస్టర్ రాఘవ్ జుయల్ తో జంటగా కనిపించడంతో అతడితో డేటింగ్ చేస్తుందంటూ ఊహాగానాలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలో తాజాగా ఓ కార్యక్రమానికి వచ్చిన షెహనాజ్ కు మీడియా నుంచి ఈ డేటింగ్ ప్రశ్నే ఎదురైంది. దీంతో ఆమె కోపంతో ఊగిపోయి.. ”’ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు? ఒకరి పక్కన నిల్చున్నామంటే వారితో రిలేషన్‌లో ఉన్నామనే అర్థమా? మేమిద్దరం కలిసి కనిపిస్తే ప్రేమలో ఉన్నట్లేనా? కాదు కదా!
అంటూనే రిపోర్టర్ ను ప్రశ్నిస్తూ.. ”నువ్వు అతని పక్కన ఉన్నావ్ అంటే అతనితో నువ్వు రిలేషన్ లో ఉన్నావా”? అని అడగ్గా రిపోర్టర్ కాదు అని సమాధానం ఇచ్చింది. దీంతో మరి కలిసున్నంత మాత్రాన రిలేషన్ అంటగడతారా అంటూ.. ఘాటుగా రిప్లై ఇచ్చింది ఆ రిపోర్టర్ కి. దాంతో నెటిజన్స్ కొందరు కామెంట్ చేస్తూ భలే రిప్లై ఇచ్చారు.. మేడం ఆన్ ఫైర్.. మిమ్మల్ని చూసి మేం గర్వ పడుతున్నాం. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి షెహనాజ్ ఇచ్చిన రిప్లై పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.