చిత్ర పరిశ్రమకు, రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. అలనాటి ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచి నేటి రోజా, జయసుధ, విజయశాంతి లాంటి ఎందరో తారలు రాజకీయాలలో తమదైన ముద్రను వేశారు. ఈ క్రమంలోనే మరో నటి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అన్నీ కుదిరితే రాబోయే ఎలక్షన్లలో ఓ జాతీయ పార్టీలో చేరి, పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సినీ తారలు ఓ స్టేజ్ కు వచ్చాక వివిధ రంగాలపై ఆసక్తి చూపడం సాధారణమే. అందులో భాగంగానే త్రిష కూడా త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనుందని సౌత్ ఇండస్ట్రీలో వినికిడి. ఇక అన్నీ కుదిరితే త్రిష కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. అయితే త్రిషను వెనుక నుంచి నడిపించేది మాత్రం తమిళ హీరో తలపతి విజయ్ అని అక్కడి పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'పొన్నియన్ సెల్వన్': 1లో కీలక పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ సెఫ్టెంబర్ 30 థియేటర్లలో విడుదల కానుంది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్ లాంటి భారీ తారాగాణం ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే అలనాటి సినీ తారలలా త్రిష రాజకీయ రంగంలో తన దైన ముద్ర వేస్తుందా? లేదా? వేచిచూడాల్సిందే. మరి అందాల తార త్రిష పొలిటికల్ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Karthika Deepam Serial: సినిమాగా కార్తీకదీపం సీరియల్.. సరికొత్త చరిత్రకు నాంది! ఇదీ చదవండి: Nara Lokesh: వీడియో: బర్త్‌డే పార్టీలో నారా లోకేష్, మోహన్ బాబు కబుర్లు!