సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోంచే వారిలో సినీతారలే ముందుంటారు. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు కాబట్టి.. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి, ఏవైనా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే విషయాలను పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో రీల్స్ వచ్చాక అవి కూడా చేస్తున్నారు ఓకే. కానీ ఒక హీరోయిన్ అయ్యుండి పర్సనల్ వీడియోలను రీల్స్ గా పోస్ట్ చేయడం అనేది వివాదాలకు దారితీసే విషయం. ఇటీవల 2 మిలియన్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఓ కుర్ర హీరోయిన్.. తాను షవర్ బాత్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదాలలో నిలిచింది.
అసలు విషయానికి వస్తే.. మలయాళీ యువనటి సానియా అయ్యప్పన్ గురించి సౌత్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇక గ్లామర్ షో, ఎక్స్ పోజింగ్ విషయంలో తగ్గేదేలే అనిపిస్తుంది. తెలుగులో సినిమాలు చేయలేదు కానీ కుర్రకారుకి బాగానే సుపరిచితం. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ సినిమాతో సానియా మంచి గుర్తింపు దక్కించుకుంది.
తాజాగా సానియా పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట చిచ్చు రేపింది. బికినీలో నది ఒడ్డున ఓపెన్ షవర్ కింద స్నానం చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సానియా. వీడియో చేస్తూ బాగానే ఎంజాయ్ చేసింది.. వీడియో కూడా బాగానే వైరల్ అయింది. కానీ ఫ్యాన్స్ సానియా అందచందాలపై కామెంట్స్ చేసినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఓ హీరోయిన్ ఇలా ఓపెన్ గా స్నానం చేసిన వీడియోని పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేయడమేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్.. ‘సిగ్గులేదా? ఇలా స్నానం చేసే వీడియోలను పోస్ట్ చేశావ్. ఇక ఈవ్ టీజింగ్ కేసులు ఇంకెలా తగ్గుతాయి’ అంటూ చేసిన కామెంట్ కి.. ‘అసలు సిగ్గంటే ఏంటి’ అని ఈ సానియా ఘాటుగా రిప్లై ఇవ్వడం గమనార్హం. మరి ఈ బ్యూటీ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.