ఐపీఎల్ 2013 సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న శ్రీశాంత్.. అప్పటి నుంచి ఐపీఎల్ లో కనిపించలేదు. ఈ క్రమంలోనే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ స్పీడ్ స్టర్ మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
సాధారణంగా క్రికెట్ లో నిషేధం ఎదుర్కొన్న ఆటగాళ్లు.. ఇక భవిష్యత్ లో మళ్లీ ఆ ఆటవైపు చూడరు. అయితే కొందరు తమ నిషేధ కాలం ముగిసిన తర్వాత మళ్లీ జట్టులోకి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక వరల్డ్ క్రికెట్ లో చాలా మంది ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని నిషేధం ఎదుర్కొన్న ఆటగాళ్లు ఉన్నారు. వారిలో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా ఒకడు. ఐపీఎల్ 2013 సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న శ్రీశాంత్.. అప్పటి నుంచి ఐపీఎల్ లో కనిపించలేదు. ఈ క్రమంలోనే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ స్పీడ్ స్టర్ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
శ్రీశాంత్.. 2013కు ముందు టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఓ వెలుగు వెలిగాడు. గ్రౌండ్ లో అగ్రెసివ్ యాటిట్యూడ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అనేవాడు. ఇక హర్భజన్ తో గొడవ అయితే పెద్ద దుమారాన్నే లేపిందని చెప్పాలి. ఇక తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. 2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. దాంతో నిషేధం ఎదుర్కొని ఆటకు దూరం అయ్యాడు. గత సంవత్సరం మార్చిలో తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇక శ్రీశాంత్ ఐపీఎల్ కు దూరం అయ్యి 10 సంవత్సరాలు కావొస్తోంది. ఈ క్రమంలోనే శ్రీశాంత్ కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే?
పదేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ స్పీడ్ స్టర్. అయితే ఆటగాడిగా మాత్రం కాదు సుమీ. అవును ఈసారి ఐపీఎల్ లో ఓ కొత్త అవతారంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తున్నాడు శ్రీశాంత్. ఈ విషయాన్ని ఐపీఎల్ లీగ్ టోర్నమెంట్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. అసలు విషయం ఏంటంటే? IPL ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో.. స్టార్ స్పోర్ట్స్ తన ప్యానెల్ చర్చా సభ్యుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో శ్రీశాంత్ పేరు ఉండటం విశేషం.
ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో మలయాళ ఛానల్ లో వ్యూయర్ అనలిస్ట్ గా శ్రీశాంత్ సందడి చేయనున్నాడు. దీంతో 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ లో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించినట్లు అయ్యింది. ఇక ఈ చర్చా వేదికల్లో శ్రీశాంత్ తో పాటుగా.. జాక్వెస్ కల్లిస్, పీటర్సన్, టామ్ మూడీ, ఇర్ఫాన్ పఠాన్ మరికొంత మంది స్టార్ క్రికెటర్లు ఈ చర్చల్లో సందడి చేయనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? హర్భజన్ సింగ్ సైతం ఈ చర్చల్లో పాల్గొననున్నాడు. మరి పదేళ్ల తర్వాత శ్రీశాంత్ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెయజేయండి.
#IPL2023: Star-studded panel of commentators announced; Jacques Kallis, #YusufPathan, S Sreesanth to make debut
Read: https://t.co/RZB2RQjEjV#IPL pic.twitter.com/YtsxeQFlq6
— Cricket Fanatic (@CricketFanatik) March 21, 2023