మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు ఓ స్టార్ నటుడు. మోహన్ లాల్ ఓ మెసగాడు అని, అతడికి సంబంధించిన అన్ని విషయాలను నేను చచ్చేలోగా బడయటపెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ నటుడు ఎవరు? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఇండస్ట్రీలో కొంత మంది హీరోల మధ్య అంత మంచి సంబంధాలు ఉండవు. ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయా భేదాలు రావడంతో.. ఇద్దరు విడిపోవడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలా విడిపోయిన సదరు నటీ, నటులు విమర్శలు చేసుకోవడం పరిశ్రమలో సర్వసాధారణమైన విషయమే. అదీకాక ఇలా ఇద్దరు హీరోలు, నటులు విమర్శించుకున్న సందర్భాలు కూడా మనం చూసే ఉన్నాం. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు ఓ స్టార్ నటుడు. మోహన్ లాల్ ఓ మెసగాడు అని, అతడికి సంబంధించిన అన్ని విషయాలను నేను చచ్చేలోగా బడయటపెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ నటుడు ఎవరు? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
మోహన్ లాల్.. మలయాళంలో సూపర్ స్టార్ గా కొనసాగుతూనే.. ఇతర ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతున్నాడు. వైవిధ్యమైన యాక్టర్ గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు మోహన్ లాల్. అయితే మరో మలయాళ నటుడు అయిన శ్రీనివాసన్ కు మోహన్ లాల్ కు మధ్య మంచి సంబంధాలు లేవు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీనివాసన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ లాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. తాను చనిపోయే వరకు మోహన్ లాల్ కు సంబంధించిన అన్ని విషయాలు బయటపెడతానంటూ.. సంచలన కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ మాట్లాడుతూ..
“గతంలో ప్రేమ్ నజీర్ తన డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ లో మోహన్ లాల్ నటించాలని కోరుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ టైమ్ లో ఇదే విషయాన్ని అతడితో చెప్పాడు నజీర్. అయితే మోహన్ లాల్ మాత్రం ఆసక్తి చూపలేదు. నేను నడరాజన్ అనే మీడియేటర్ తో మోహన్ లాల్ కు కథ చెప్పినప్పుడు, అతడు నన్ను తిట్టాడు. అదీకాక ఓ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత.. ఆ చిత్రంలో తాను నటించాలనుకున్నట్లు ఓ వార్త పత్రికతో మోహన్ లాల్ చెప్పడంతో బాధపడ్డాను” అని శ్రీనివాసన్ చెప్పుకొచ్చాడు. నజీర్ కుమారుడు కూడా తన తండ్రి మోహన్ లాల్ తో సినిమా చేయాలనుకున్నాడని, తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ ఆ సినిమా తెరకెక్కలేదని ప్రేమ్ నజీర్ కొడుకు షానవాజ్ చెప్పుకొచ్చినట్లుగా శ్రీనివాసన్ తెలిపాడు. మోహన్ లాల్ ఓ మోసగాడు, త్వరలోనే అతడికి సంబంధించిన అన్ని విషయాలను బయటపెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు శ్రీనివాసన్. మరి ఈ కామెంట్స్ పై మోహన్ లాల్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.