సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్ల్స్ మీద ఆవేదన వ్యక్తం చేసింది స్టార్ హీరోయిన్. తన గురించి వచ్చే అసభ్యకర మీమ్స్, ట్రోల్స్ ఎంతగానో బాధించాయని, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ఇవి నన్ను చాలా ఇబ్బందికి గురి చేసాయని ఆ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది.
రితిక సింగ్ అంటే తెలుగు వారికి పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు. 2017 సంవత్సరంలో వెంకటేష్ హీరో గా వచ్చిన “గురు”సినిమాతో తెలుగు వాళ్లకి పరిచయమైంది. ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ముంబై లో జన్మించిన రితిక సింగ్ కేవలం నటి మాత్రమే కాదు ఒక క్రీడాకారిణి. ఈమె మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావిణ్యం పొందింది. 2009 లో భారత్ తరపున ఆసియా గేమ్స్ లో, సూపర్ ఫైట్ లీగ్ లలో పాల్గొంది. ఆ తర్వాత 2012 లో “ఇరుదు చుట్రు”అనే తమిళ సినిమా తో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో మాధవన్ తో “సాల కడూస్”సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈమె తమిళ్ ల్లో నటించిన కార్ అనే సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్లో భాగంగా సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ మీద విరుచుకుపడింది.
రితిక సింగ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్ల్స్ మీద ఆవేదన వ్యక్తం చేసింది. “సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ఇవి నన్ను చాలా ఇబ్బందికి గురి చేసాయి. దీనితో నా హార్ట్ బ్రేక్ అయింది. అంతే కాదు నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. నాకు పేరెంట్స్, బ్రదర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవి చూస్తే వారి హృదయం కూడా బద్దలవుతుంది. నేను ముఖ్యంగా కోరుకునేది ఏమిటంటే.. రెస్పెక్ట్. ఆడవారికి అందరూ గౌరవం ఇవ్వాలి. ఒక అమ్మాయి మిడిల్ క్లాస్ అయినా సెలబ్రిటీ అయినా ఒకే రకమైన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మిడిల్ క్లాస్ అయినంత మాత్రాన మనం వారిని తక్కువగా చూడకూడదు” అని రితిక చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్సివ్ ఉండాలి. దీనికోసం స్కూల్లో, కాలేజీల్లో వారానికి కనీసం ఒక్కసారైనా “సెల్ఫ్ డిఫెన్సివ్”కి సంబంధించిన క్లాసులు జరగాలి. అదృష్టవశాత్తు నేను చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఈ విషయంలో నా తరపున ఏమైనా సహాయం కావలి అనుకుంటే కచ్చితం గా చేస్తాను. తర్వాత జనరేషన్ లో నైనా పిల్లలకు చాలా త్వరగా సమాజం పట్ల అవగాహనా కలిగేలా చేయాలి”. అని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రితిక సింగ్ “కార్” అనే తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పిచై కారం 2’ అనే మరో సినిమా సెట్స్ మీద ఉంది. మరి రితిక సింగ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.