బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వినోదాత్మక కార్యక్రమాలు ఎన్నో ప్రవేశ పెడుతున్నారు టీవీ ఛానల్స్ నిర్వాహకులు. ఎంటర్టైన్ మెంట్ అంటే.. ఇప్పటివరకు కామెడీ షోస్ ఎక్కువగా చూస్తున్నాం. కానీ.. డాన్స్ కి సంబంధించి చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా ‘బిగ్ బాస్ జోడి’ అంటూ డాన్స్ ఎంటర్టైన్ మెంట్ షోని నిర్వహించబోతున్నారు. పేరులోనే బిగ్ బాస్ అని ఉంది.. కాబట్టి, ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ ఇందులో జంటలుగా పర్ఫర్మ్ చేయనున్నారు. క్రిస్మస్ సందర్భంగా కింగ్ నాగార్జున లాంచ్ చేసిన ఈ డాన్స్ షోని యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేయనుంది.
ఇక ఈ షోకి సీనియర్ హీరోయిన్ రాధా, సీనియర్ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్, హీరోయిన్ సదా జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ప్రతి శని, ఆదివారాలలో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో బిగ్ బాస్ జోడిలుగా డివైడ్ అయినవారంతా పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు. జడ్జి రాధా, తరుణ్ మాస్టర్ కూడా సందడి చేశారు. అయితే.. ప్రోమో చివరికి వచ్చేసరికి జబర్దస్త్ అవినాష్, యాంకర్ అరియానా జంటగా పెర్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత జడ్జిమెంట్ టైమ్ లో అవినాష్.. సూపర్ స్టార్ కృష్ణని ఇమిటేట్ చేస్తూ పలకరించాడు.
దీంతో సూపర్ స్టార్ వాయిస్ లో పలకరించేసరికి ఒక్కసారిగా నటి రాధా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. సూపర్ స్టార్ కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన రాధా.. ఆయన ఇకలేరనే వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతూ ఏడ్చేసింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా రాధా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సూపర్ కృష్ణతో పాటు నాగేశ్వరరావు, శోభన్ బాబు, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరు హీరోల సరసన ఎన్నో సినిమాలు చేసి స్టార్డమ్ అందుకుంది. ఇక చాలాయేళ్ల తర్వాత తెలుగు షోలో ఎంట్రీ ఇచ్చిన రాధా.. సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకొని, తనకు ఎంతో ఇష్టమైన హీరో అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి నటి రాధా రీఎంట్రీపై, సూపర్ స్టార్ కృష్ణతో ఆమె చేసిన సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.