చిరంజీవి, రాధ.. తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన క్రేజీ కాంబినేషన్ ఇది. మెగాస్టార్‌తో పోటీపడి మరీ హుషారుగా స్టెప్పులేసే వారామె. వీరిద్దరి కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు, సూపర్ డూపర్ చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి.
సావిత్రి, శారద, భానుమతి, దేవిక, జానకి, కృష్ణకుమారి, సూర్యకాంతం, కన్నాంబ వంటి వారు తెలుగు నేలపై పుట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో రారాణులుగా ఎదిగారు. ఇప్పుడంటే మాలీవుడ్ నుండి హీరోయిన్స్ తెచ్చుకుంటున్నాం కానీ.. కేరళలో పుట్టి.. తెలుగు తెరను ఏలిన ఓ అగ్రతార ఎవరో తెలుసా..?
సీనియర్ నటి రాధా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు సౌత్ ఇండియాని ఊపేసింది. అయితే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాధా.. తన ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా పరిచయం చేసింది. రాధా పెద్ద కూతురు కార్తీక. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన 'జోష్' సినిమాతో డెబ్యూ చేసింది. జోష్ సినిమా నిరాశపరచడంతో.. తర్వాత తమిళ, కన్నడ, మలయాళం భాషలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా కెరీర్ లో ఎక్కువగా ప్లాప్స్ పడటంతో అవకాశాలు తగ్గిపోయి.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వినోదాత్మక కార్యక్రమాలు ఎన్నో ప్రవేశ పెడుతున్నారు టీవీ ఛానల్స్ నిర్వాహకులు. ఎంటర్టైన్ మెంట్ అంటే.. ఇప్పటివరకు కామెడీ షోస్ ఎక్కువగా చూస్తున్నాం. కానీ.. డాన్స్ కి సంబంధించి చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా ‘బిగ్ బాస్ జోడి’ అంటూ డాన్స్ ఎంటర్టైన్ మెంట్ షోని నిర్వహించబోతున్నారు. పేరులోనే బిగ్ బాస్ అని ఉంది.. కాబట్టి, ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ ఇందులో జంటలుగా పర్ఫర్మ్ […]