మెగాస్టార్‌తో ఆడి, పాడాలని ఏ హీరోయిన్ కు ఉండదు చెప్పండి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ల మొదలు ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోన్న కుర్రకారు కథానాయికల వరకు అందరికీ ఇదొక కల. అలాంటి కోరికే.. గ్లామర్ బ్యూటీ ప్రియమణికి ఉందట. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, ఎందరో కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. టాలీవుడ్‌లో ప్రతిభ కలిగిన నటీనటులకు, దర్శకులకు కొదవ లేదు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత టాలీవుడ్‌కే సొంతం. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అగ్రహీరో అనడంలో సందేహం లేదు. ‘తాను సినీ ఇండస్ట్రీకి పెద్ద కాదు..’ అనే మెగాస్టార్ పదే పదే చెప్తున్నప్పటికే అతను చేసే మంచి పనులు, అతనిని ఎప్పుడో ఆ స్థాయికి చేర్చాయి. ఇక మెగాస్టార్ తో ఆడి, పాడాలని కోరికలున్న హీరోయిన్లకు ఇండస్ట్రీలో కొదవ లేదు. ఇదిలావుంటే గ్లామర్ బ్యూటీ ప్రియమణి, మెగాస్టార్‌పై మనసుపారేసుకున్నట్లు తెలిపింది. ‘మెగాస్టార్‌తో రొమాన్స్ చేయాలని ఉందంటూ..’ తన మనసులోని కోరికను బయటపెట్టింది.
వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తూ అభిమనుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తూ ఆదుకోవడమే కాదు, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి సమాజ సేవకు పూనుకున్నారు. కోవిడ్ కష్టకాలంలో ఎంతో మంది పేద కళాకారులకు సహాయం అందించారు. ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి కోవిడ్ రోగుల కష్టాలను తీర్చారు. ఈ మధ్యకాలంలో విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో ఆకట్టుకున్నారు. త్వరలో విడుదల కానున్న భోళా శంకర్ మూవీతో అలరించేందుకు సిద్దమయ్యారు. ఇంతటి స్టార్ డమ్ ఉన్న హీరోతో నటించాలని ఏ హీరోయిన్ కు అయినా ఉంటుంది. ఇదే విషయంపై టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి తన మనసులోని మాటను బయటపెట్టింది.
ప్రియమణి శుక్రవారం విడుదలైన కస్టడీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె తెలుగు హీరోల గురించి మాట్లాడింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. “నేను టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలతో నటించానని చెప్పారు. కానీ అది పూర్తి కాలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అగ్ర హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రాలేదు. చిరంజీవితో నటించాలని, ఆయనతో కలిసి రోమాన్స్ చేయాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి, ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా..” అని ప్రియమణి తెలిపారు.