ఒకప్పటి స్టార్ హీరోయిన్ ‘ప్రేమ’ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ధర్మ చక్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రేమ.. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కోడి రామకృష్ణ గారు తెరకెక్కించిన ‘దేవి’ చిత్రతో ప్రేమ క్రేజ్ డబుల్ అయింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ గా పలు క్రేజీ సినిమాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు కుర్రాళ్లలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్యూల్లో పాల్గొన్న ఆమె.. తనకు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. తాను స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సహాయ నటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలిపింది. త్రివిక్రమ్ ను నమ్మినందుకు తనను మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కన్నడ నటి ప్రేమ.. భక్తిపరమైన పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించింది. దేవతలు అంటే ఇలానే ఉంటారేమో అనేలా ఆ పాత్రల్లో ప్రేమ జీవించేది. అలాంటి పాత్రలు ఆమెకు మాత్రమే సాధ్యం. ఇలాంటి క్యారెక్టర్లతో పాటు గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. అలా అతి తక్కువ కాలంలో పలు భాషల్లో నటించింది. అంతేకాక అప్పటి కుర్రాళ్లకు ఆమె కలల రాణిగా వెలిగింది. అనేక చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రేమ ఎంతో త్వరగా వెలుగులోకి వచ్చింది. అంతే త్వరగా ఫెడ్ అవుట్ జాబితాలోకి చేరిపోయింది. ఇటీవల మళ్లీ కొన్ని సినిమాలో నటించి..ప్రేక్షకులను పలకరించింది. చాలా కాలం తరువాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.
తాను హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ‘చిరునవ్వుతో’ సినిమాతో సహాయనటిగా ఎందుకు నటించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. చిరునవ్వుతో అనే సినిమా ఈమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది అన్నట్టు కామెంట్స్ చేసింది. ముఖ్యంగా త్రివిక్రమ్ వల్లే తాను త్వరగా ఫేడౌట్ అయినట్టు ఈమె చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్న సమయంలో త్రివిక్రమ్ కథను సమర్పించిన చిరునవ్వుతో సినిమా లో అవకాశం వచ్చిందంట. ఆ సినిమాలో ప్రేమది.. బావతో పెళ్లి వద్దనుకుని ఓ మోసగాడిని పెళ్లి చేసుకుని మోసపోయిన అమ్మాయి పాత్ర. అయితే ఆ క్యారెక్టర్ చేయడానికి మొదట ప్రేమ సంకొచించిందంట. అయితే త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఆ సినిమా చేసిందంట.
ప్రేమ మాట్లాడుతూ…” నేను అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్నాను. మొదట త్రివిక్రమ్.. ‘చిరునవ్వుతో’ సినిమాలో నాది హీరోయిన్ పాత్రనని చెప్పారు. అయితే ఇందులో మరో హీరోయిన్ ఉందా? అని అడిగాను. నీది కూడా హీరోయిన్ రేంజ్ పాత్రేనని చెప్పి.. తివిక్రమ్ నన్ను ఒప్పించాడు. కథ మొత్తం నా చుట్టూనే ఉంటుందని చెప్పడంతో, త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఆ సినిమా చేశాను. అది రిలీజ్ అయ్యాక నాదంతా సహాయనటి పాత్రగా మారిపోయింది. షూటింగ్ కి ముందు ఒకలా చెప్పి.. సినిమాలో నన్ను ఇంకోలా చిత్రీకరించి త్రివిక్రమ్ మోసం చేశాడు. ఇక ఆ సినిమా తరువాత నాకు అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి. ఆ సినిమా వల్లనే నా కెరీర్ పోయింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.