సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తెలుగు సీనియర్ నటీమణులలో ప్రగతి ఒకరు. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా ప్రగతి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ట్రెండ్ తగ్గట్టుగా జీవించాలని.. తనని తాను అప్ డేట్ చేసుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.
ప్రగతి ఎంత యాక్టీవ్ అనేది అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన డాన్స్, ఫోటోషూట్స్, ట్రెండింగ్ రీల్స్ తో నెట్టింట ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. అప్పుడప్పుడు ఆమె వర్కౌట్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఓ వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈసారి కొత్తగా ఏం చేసుంటుందని అనుకుంటున్నారా! వీడియో చూస్తే పెద్ద సాహసమే చేసిందని మీకే అర్ధమవుతుంది.
#Pragathi👅 pic.twitter.com/w3QARMJOi1
— King David 👑 (@DavidKottayam) February 8, 2022
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొత్త వీడియోలో ప్రగతి.. తన జిమ్ ట్రైనర్ తో కలిసి కొత్త ఫీట్ చేసింది. లాక్ డౌన్ టైమ్ నుండి ఫిట్నెస్ పై దృష్టిపెట్టిన ప్రగతి.. తాజా వీడియోలో తన జిమ్ ట్రైనర్ ని తన మోకాళ్లపై నిలబెట్టుకొని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా జిమ్ ట్రైనర్ బరువుని ఆపడం అనేది మాములు విషయం కాదు. ప్రస్తుతం వీడియో చూస్తూ నెటిజన్లు సైతం ప్రగతి పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. మరి నటి ప్రగతి కొత్త వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.