నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమ్మ, అక్క, అత్త, వదిన వంటి క్యారెక్టర్లలో తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఏ టైప్ రోల్ అయినా అవలీలగా చేసేస్తారామె.
నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమ్మ, అక్క, అత్త, వదిన వంటి క్యారెక్టర్లలో తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఏ టైప్ రోల్ అయినా అవలీలగా చేసేస్తారామె. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ప్రగతికి సపరేట్ ఫ్యాన్ బేస్, స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తను జిమ్‌లో చేసే వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు, ఫోటోషూట్స్, రీల్స్ వంటివి వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఆన్ స్క్రీన్ అమ్మ పాత్రలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించే ప్రగతి ఇంత హార్డ్‌కోర్ వెయిట్ లిఫ్టర్‌గా కనిపించడం చూసి సినీ వర్గాల వారు, నెటిజన్లు అవాక్కయిన సందర్బాలు చాలానే ఉన్నాయి.
ఇలా వీడియోస్ అప్‌లోడ్ చేయడమే లేటు క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి వీడియోలు చేస్తూ బీజీగా గడిపేస్తుంది. ఇక తాజాగా మరో కొత్త జర్నీ మొదలు పెట్టారు ప్రగతి. ఇప్పటి వరకు ఏదో ఫిట్‌నెస్ కోసం వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారిపోయినట్లు పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
‘‘కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది. రెండు నెలల క్రితం నా జీవితం ఇంతలా మలుపు తిరుగుతుందని నేను ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్ నా న్యూ జర్నీ. 2 నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ ప్రయాణంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసి తీరతాను. ప్రస్తుతం నా స్కోర్ 250. టార్గెట్ చాలా పెద్దదే కానీ దాన్ని రీచ్ అయ్యే వరకు తగ్గేదే లే’’ అంటూ పవర్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు ప్రగతి. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న‘భోళా శంకర్’ లో కీలకపాత్రలో నటిస్తుంది. తమన్నా కథానాయికగా.. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా కనిపించనున్నారు.