ప్రముఖ నటి పార్వతి నాయర్‌పై నీఛమైన ఆరోపణలు చేసిన ఆమె ఇంటి పనివాడు సుభాష్ చంద్రబోస్ అరెస్ట్ అయ్యాడు. నిన్న చెన్నై సిటీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పార్వతి పరవుకు భంగం కలిగించేలా కామెంట్లు చేయటమే కాక, ఆమె ఫోన్‌ను దొంగిలించి అందులోని ఫొటోలను తప్పుడు పనులకు వాడాడన్న కారణంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఇక, పార్వతికి, ఆమె ఇంట్లో పని చేసిన సుభాష్‌కు మధ్య గత కొన్ని నెలలనుంచి వివాదం నడుస్తోంది. రెండు నెలల క్రితం తన ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయని పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుభాష్‌పై ఎక్కువ అనుమానం ఉందని ఆమె పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో సుభాష్ పోలీసుల విచారణకు సహకరించలేదు. అంతటితో ఆగకుండా ఆమెపై బెదిరింపులకు దిగాడు.
మరో అడుగు ముందుకు వేసి పార్వతిపై మీడియా ముందు నీఛమైన ఆరోపణలు చేశాడు. పార్వతి ఇంట్లోకి రాత్రి సమయంలో ఎవరెవరో వచ్చి వెళుతున్నారని, అది చూసినందుకే తనపై కోపంగా ఉందని అన్నాడు. ఈ నేపథ్యంలోనే దొంగ కంప్లైంట్ ఇచ్చిందని ఆరోపించాడు. ఓ డైరక్టర్ తనను ఆమె ఇంటి దగ్గర ఉంచాడని, ఆమెను ఓ కంట కనిపెట్టమని ఆ డైరెక్టర్ తనతో చెప్పాడని తెలిపాడు. అతడి ఆరోపణలతో ఆగ్రహానికి గురైన పార్వతి నాయర్ కూడా మీడియా ముందుకు వచ్చారు. అతడికి కౌంటర్ ఇచ్చారామె. పార్వతి నాయర్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు స్టాఫ్ అందరినీ పిలిచి ఎంక్వైరీ చేశారని పేర్కొన్నారు.
సుభాష్ మాత్రం ఎంక్వైరీకి సహకరించలేదని చెప్పారు. తనపై బ్లాక్ మెయిల్‌కు కూడా దిగాడని అన్నారు. కంప్లైంట్ వెనక్కు తీసుకోకపోతే చచ్చిపోతానంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపారు. అయినా తాను పట్టించుకోలేదని అన్నారు. అందుకే తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడాడని, అతడు చెప్పిన ప్రతీ విషయం అబద్ధమని అన్నారు. సుభాష్ తప్పు చేశాడనడానికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. సుభాష్ మనుషులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు చాలా బాధగా ఉందని, ఆ విషయం మానసికంగా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
#Watch | “மிரட்டல்களாலும், தேவையற்ற வதந்திகளாலும் என் சினிமா வாழ்க்கையை அழிக்க முயற்சிக்கிறார்கள்”
– சென்னை காவல் ஆணையர் அலுவலகத்தில் புகார் அளித்தப்பின் நடிகை பார்வதி செய்தியாளர்கள் சந்திப்பு!#SunNews | #ActressParvathi | #TNPolice pic.twitter.com/21HyBNdqJb
— Sun News (@sunnewstamil) November 26, 2022