Nikki Tamboli: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కొత్తగా ఏం కొనుగోలు చేసినా ముందుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఏదైనా కొత్త విషయం ఉందంటే చాలు.. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి బెంజ్ కారు కొని వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ బ్యూటీ బెంజ్ కారు కొనుగోలు చేసిందా? అని ఆశ్చర్యపోకండి.
వివరాల్లోకి వెళ్తే.. ‘తిప్పరా మీసం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిక్కీ తంబోలి.. ఆ తర్వాత ‘చీకట్లో చితక్కొట్టుడు’ అనే సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. అయితే.. నిక్కీ నటిగా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మూడు మిలియన్స్ కి పైగానే సంపాదించుకుంది. హిందీలో ఖత్రోంకీ ఖిలాడీ షో సీజన్ 11 ద్వారా పాపులర్ అయిన నిక్కీ.. బుల్లితెరపై కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది.
నిక్కీ తంబోలి తెలుగు ప్రేక్షకులకు చివరిగా కాంచన 3 సినిమాలో కనిపించింది. ఆ తర్వాత హిందీ ‘బిగ్ బాస్ 14’ సీజన్ లో పాల్గొన్న నిక్కీ.. అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచి రన్నరప్ గా నిలవడం విశేషం. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ అయిన నిక్కీ.. తాజాగా మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొనుగోలు చేసి సర్ప్రైజ్ చేసింది. అలాగే కొత్త కారు కొన్న సందర్భంగా తన తండ్రితో కలిసి సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.
నిక్కీ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ కారు ధర దాదాపు కోటి 25 లక్షల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. ఇక నిక్కీ కొత్త కారు కొన్న విషయం తెలిసి ఆమె ఫ్రెండ్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. నిక్కీ తంబోలి కొత్త కారు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.