సినిమా ప్రపంచంలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. పెళ్లి అయిపోయిన తర్వాత వారికి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కానీ, ఈమె విషయంలో అలా జరగలేదు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా మారిన నటీమణులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా ఒకరు. 2006లో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత 2013లో హీరోయిన్గా మారిపోయారు. హీరోయిన్గా మారిన అదే సంవత్సరం విడుదలైన ఓ సినిమా ఆమె దశ మార్చేసింది. ఆమెను ఓవర్ నైట్ స్టార్‌ను చేసేసింది. దీంతో తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో పిచ్చపాపులర్ అయిపోయారు.
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఇంకెవరో కాదు ‘నజ్రియా నజీమ్’. ఈమె తెలుగులో తీసింది ఒక సినిమానే అయినా.. తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కానీ, నజ్రియా నజీమ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. పెళ్లి తర్వాత కూడా అవకాశాలు క్యూలు కట్టాయి. అయితే, ఆమె వాటిలో కొన్నింటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 2014లో ఆమె తన సహ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా మానేయలేదు. 2014నుంచి ఇప్పటివరకు నాలుగు సినిమాలు మాత్రమే చేశారు. అందులో ఓ తెలుగు సినిమా కూడా ఉంది. ఆ సినిమానే ‘ అంటే సుందరానికి’. ఇదే ఈమె మొదటి తెలుగు సినిమా కావటం విశేషం. కాగా, నజ్రియా నజీమ్ 2006లో వచ్చిన పలుంకు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చారు. రాజారాణి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భిన్నమైన నటనతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. పెళ్లయినా కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవటం గమనార్హం.