బుల్లితెర సెలబ్రిటీలు ఎంటర్టైన్ మెంట్ షోస్ లో పాల్గొన్నారంటే చాలు.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి బజ్ ఉన్న సెలబ్రిటీ వస్తే.. ఖచ్చితంగా స్పెషల్ పెర్ఫార్మన్స్ ఉంటుందని ఆశగా చూస్తుంటారు. మరి ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయంటే.. సెలబ్రిటీలు ఊరుకుంటారా? మాక్సిమమ్ వారిని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా తాజాగా పాపులర్ సీరియల్ లీడ్ కాస్ట్ ఓ షోలో పాల్గొని చేసిన డాన్స్ ప్రెజెంట్ వైరల్ గా మారింది. తెలుగులో ప్రసారమవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ గురించి, ఆ సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సీనియర్ నటి కస్తూరి.. ‘తులసి’ పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ మొదలైనప్పటి నుండి మంచి బజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. గృహలక్ష్మి సీరియల్ అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా పాపులర్. అయితే.. ఈ సీరియల్ ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చిన నటి కస్తూరి.. సీరియల్ లో ఎలా కనిపిస్తుందో.. రియల్ లైఫ్ లో పూర్తి భిన్నంగా బోల్డ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా కస్తూరి, తులసి సీరియల్ లో ఆమెకు జంటగా సామ్రాట్ పాత్రలో నటించిన ఇంద్రనీల్.. ఇద్దరూ టీవీ షోలో పాల్గొని సందడి చేశారు. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘ఆదివారం స్టార్ మా పరివారం’ అనే షో నుండి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ప్రోమో అంతా సీరియల్ ఆర్టిస్టులు, వారి సన్నిహితుల పెర్ఫార్మన్స్ లతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ.. కస్తూరి, ఇంద్రనీల్ ఇద్దరూ స్టేజ్ పై పెదరాయుడు సినిమాలోని ‘బావవి నువ్వు’ అనే పాటకు అదిరిపోయే డాన్స్ చేశారు. ప్రస్తుతం వీరి డాన్స్ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరోవైపు సీరియల్ లో కస్తూరి, ఇంద్రనీల్ జంటపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తులసి, సామ్రాట్ ల డాన్స్ చూస్తూ గృహలక్ష్మి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి తులసి – సామ్రాట్ ల డాన్స్ పెర్ఫార్మన్స్ పై, సీరియల్ లో వీరి జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.