కల్పిక గణేశ్.. ఈమెకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్‌లో కనిపిస్తూ వచ్చారు. 2009లోనే ‘ప్రయాణం’ సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో చాలానే సినిమాల్లో నటించారు. ‘సీతా ఆన్ రోడ్స్’ అనే అద్భుతమైన సినిమాలో కల్పిక లీడ్ రోల్‌లో కనిపించి మెప్పించారు. ఆమె టాలెంట్ తగిన అవకాశాలు రాలేదని చాలా మందే కామెంట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ కంటే అందంగా ఉంటాను, డామినేట్ చేస్తానని కారణాలతో నన్ను ఎక్కువగా సినిమాల్లో నుంచి తీసేశారేమో అంటూ కల్పిన అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలే సమంత లీడ్ రోల్ చేసిన యశోద సినిమాలో కల్పిక కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమా సక్సెస్ మీట్‌లో కల్పిక కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమంత ఎలాగైతే మయోసైటిస్‌తో బాధ పడుతోందో నేను కూడా గత 13 ఏళ్లుగా అలాంటి ఒక వ్యాధితో బాధపడుతున్నాను అంటూ కల్పిక చెప్పుకొచ్చింది. ఆ రోజు కూడా డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉన్నా కూడా సమంతను కలిసేందుకు అక్కడికి వచ్చానన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆమె వ్యాధి గురించి ఎవరికీ ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే తాజాగా కల్పిక తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆస్పత్రి బెడ్ ఉన్న ఓ ఫొటో పోస్ట్ చేసింది. సక్సెస్‌ఫుల్‌గా లుంబార్ రాడిక్యూలోపథీ పూర్తి చేసుకున్నాను అంటూ క్యాప్షన్ పెట్టింది.
అయితే ఇన్నాళ్లలో కల్పిక ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రేక్షకులకు తెలియదు. ఇప్పుడు తాజాగా తన పరిస్థితి ఇది అనీ చెప్పడంతో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. తాను ఇప్పటికే ఈ వ్యాధితో 13 ఏళ్లుగా పోరాడుతున్నట్లు వెల్లడించింది. తాను ప్రస్తుతం తొలి దశలో ఉన్నారట. ఆమె చేయించుకున్న ట్రీట్మెంట్ పేరు లుంబార్ రాడిక్యూలోపథీ అంటారు. దానిని రాడిక్యూలర్ పెయిన్‌కి చికిత్సగా అందిస్తారు. అసలు రాడిక్యూలర్ పెయిన్ అంటే.. నడుము నుంటి తొడలు, పాదాల వరకు వెన్నెముక ద్వారా నొప్పి ప్రయాణిస్తుంది. దీని ద్వారా మనిషి ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, కూర్చోలేకపోవడం, ఊరికే నీరసం రావడం జరుగుతూ ఉంటుంది. వెన్నెముక నాడులను నొక్కినట్లు కావడం వల్ల ఇలాంటి నొప్పి వస్తుందంటున్నారు.
ఈ వ్యాధి ఎప్పుడు తగ్గుతుంది? దీని నుంచి విముక్తి ఉంటుందా లేదా? అలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టమే. కల్పిక ఫొటోకి మరో క్యాప్షన్ కూడా జోడించింది. “ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్.. నా పోరాటం ఎప్పుడు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి” అంటూ కోట్ చేసింది. కల్పిక ఇన్ని ఏళ్ల తర్వాత తన ఆరోగ్యం బాలేదని ప్రకటించడం, తన హెల్త్ కి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడంతో అంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. అయితే కల్పిక మాత్రం స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అభిమానులకు, ప్రేక్షకులను తన మాటలు, కోటేషన్స్ తో మోటివేట్ చేస్తూనే ఉన్నారు. ఎవరూ జీవితంలో కుంగిపోకూడదు, పోరాటం కొనసాగించాలంటూ కల్పిక చెప్పే మాటలను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.