అందాల ఆరబోతకు సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్ అయితే తమ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నారు. తాజాగా బికినీ లో దర్శనం ఇచ్చింది ఎన్టీఆర్ హీరోయిన్. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సాధారణంగా ఒక హీరోయిన్ కి క్రేజ్ రావాలంటే సినిమాల్లో నటించి మెప్పించడంతో పాటు ఆ సినిమా కూడా విజయం సాధించాలి. ఈ రెండు జరిగితేనే ఆ అమ్మడి కెరీర్ సాఫీగా ముందుకు సాగుతుంది. హీరోయిన్ ఎవరైనా దాదాపు అందరి జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. కానీ హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం చేసింది తక్కువ సినిమాలే అయినా.. పెద్దగా హిట్లు లేకపోయినా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుంది. దానికి కారణం ఆమె సోషల్ మీడియాలో చేసే హడావుడే. సినిమాల సంగతి అలా ఉంచితే.. ఎప్పటికప్పుడు ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ లుక్స్ లో రచ్చ చేస్తూ ఉంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ ని పెంచేస్తున్న ఈ భామ తాజాగా బికినీలో దర్శనమిచ్చిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అందాలు ఆరబోయడానికి సినిమాలే కాదు సోషల్ మీడియాను బాగా వాడుకోవచ్చు. ఈ విషయం జాన్వీ కపూర్ కి తెలిసినంత మరెవరికీ తెలియదేమో. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీని మొదట్లో పరాజయాలే పలకరించాయి. సినిమాల్లో కన్నా ఈ భామ కి మోడలింగ్ లోనే మంచి గుర్తింపు ఉంది. ఈమె చేసే ఫోటో షూట్లు కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ “ఎన్టీఆర్ 30” సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం సందర్భంగా ఈ బ్యూటీ గ్రీన్ శారీలో కనిపించి అందరిని ఫిదా చేసింది. తాజాగా ఈ అమ్మడి హాట్ నెస్ మరింతగా పెంచేసిందని అర్ధం అవుతుంది. ఒక్క రోజులో ఆమె ఎలా ఉందనేది నాలుగైదు ఫొటోల్లో చూపించింది. పింక్ కలర్ టాప్ లో వెకేషన్ ఎంజాయ్ చేయడం, అద్దం ముందు మేకప్ వేసుకోవడం, కార్ లో సెట్ కి వెళ్లడం లాంటివి చూపించింది.
ఇక పింక్ కలర్ బ్రాలెట్ లో అమ్మడి హాట్ నెస్ మాత్రం ఓవర్ లోడ్ అన్నట్లుగానే ఉంది. ఎద అందాలను ఆరబోసి, నడుము చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. జాన్వీ కపూర్ “ఎన్టీఆర్ 30” లో నటిస్తుండడంతో అందరి చూపు ఈ అమ్మడిపైనే పడింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు సినిమా రిలీజ్ కాకముందే ఫొటోలతోనే ముగ్గులోకి లాగేస్తుందని చెప్పుకుంటున్నారు. మరి జాన్వీ కపూర్ ఇంతలా రెచ్చిపోయి అందాలు చూపించడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.