హనీ రోజ్.. కొంతకాలం క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని, ప్రస్తుతం పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించింది. సోషల్ మీడియాలోనూ బాలయ్య భామ హనీరోజ్ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన బొందు అందాలతో కుర్రాళ్ల కు నిద్రలేకుండా చేస్తుంది. సినిమాలోనే హాట్ షో చేసిన ఈ భామ సోషల్ మీడియాలోనూ అంతకు మించి అనేలా ఉంటుంది. తాజాగా ఓ ఎరుపు శారీలో హనీ చిరునవ్వులు చిందిస్తూ అందాల విందు చేసింది. తన మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
నందమూరి నట సింహం బాలకృష్ణ సంక్రాంతి పండగ సందర్భగా జనవరి 12న వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో వీరసింహారెడ్డి, జై సింహారెడ్డిగా బాలయ్య చేసిన ద్విపాత్రాభినయం అద్భుతంగా ఉంది. ఇక బాలయ్యకు జోడీగా శృతిహాసన్, మలయాళీ భామ హనీ రోజ్ నటించారు. `వీరసింహారెడ్డి` సినిమాలో శృతి హాసన్ కంటే హనీ రోజ్ పాత్రనే బాగా హైలైట్ అయ్యింది. దీంతో శృతి కంటే హనీ రోజ్ కే ఎక్కువ పేరొచ్చింది. వీరసింహారెడ్డి మరదలు మీనాక్షి పాత్రలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో తన బొందు అందాలతో అందర్ని మెస్మరైజ్ చేసింది ఈ మలయాళీ బ్యూటీ.
ఈసినిమా కంటే ముందే `ఆలయం` అనే చిత్రంలో చిన్న పాత్రలో హనీ మెరిసింది. ఆ తర్వాత 2014లో వరుణ్ సందేశ్ `ఈ వర్షం సాక్షిగా` చిత్రంతో కూడా తెలుగు తెరపై మెరిసింది. అయితే ఆ సినిమా పరాజయం చెందడంతో హనీకి పేరు రాలేదు. ఆ తరువాత తెలుగులో ఏ సినిమా చేయలేదు. చాలా కాలం తరువాత ఇప్పుడు బాలయ్యతో `వీరసింహారెడ్డి`లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాలోని ఓ సీన్ లో హాట్‌గా, సెక్సీగానూ కనిపించింది. బెడ్‌పై ఆమె అందాలను చూపిస్తూ యువకులకు చెమటలు పట్టించిందీ బ్యూటీ. ఈ అమ్మడు బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్. గతేడాది రిలీజైన ‘మాన్ స్టర్’ మూవీలో మంచు లక్ష్మితో కలిసి హనీబేబీ లిప్ లాక్ సీన్స్ చేసింది.
తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హనీరోజ్ కుర్రాళ్లకి నిద్రలేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలా తన అందాల ప్రదర్శనతో యువకుల గుండెల్లో నిద్రపోతుంది. తాజాగా ఎరుపు రంగు చీరలో చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. చీరకట్టులో తన అందాలను చూపిస్తూ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.