టాలీవుడ్ లేడీ కమెడియన్స్ లో ఒకరైన గీతా సింగ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమెకు సంబంధించి ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటకలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయింది గీతాసింగ్ పెద్ద కుమారుడు అని సమాచారం.
టాలీవుడ్ లేడీ కమెడియన్స్ లో ఒకరైన గీతా సింగ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఎవడిగోల వాడిదే, కితకితలు లాంటి సినిమాలతో పాపులర్ అయిన గీతాసింగ్.. ఆ తర్వాత బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సినిమాలు చేసింది. అయితే.. కొన్నాళ్లుగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించి ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జీవితాన్ని ఎన్నో కష్టాలు పడుతూ నెట్టుకొస్తున్న గీతా సింగ్.. తన అన్నయ్య కుమారులను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. కాగా.. తాజాగా కర్ణాటకలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయింది గీతాసింగ్ పెద్ద కుమారుడు అని సమాచారం.
ఈ వార్తకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గీతా సింగ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా జీవిస్తోంది. ఈ నేపథ్యంలో తన అన్న కుమారులనే దత్తత తీసుకొని.. వారితోనే ఉంటోందని తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు చనిపోయిన గీతా సింగ్ కుమారుడి పేరు, వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఇక గీతా సింగ్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ముఖ్యంగా ఈమెకు దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మరి అసలే కొంతకాలంగా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న గీతాసింగ్.. కుమారుడిని కోల్పోవడం బాధాకరమని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.