సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు లేదా ఇతర లేడీ సిబ్బంది తమ లైఫ్ లో ఫేస్ చేసిన సంఘటనలను షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ళవరకు ఇలాంటివి పెద్దగా బయటికి తెలిసేవి కాదు. కానీ.. ఎప్పుడైతే మీటూ ఉద్యమం మొదలైందో.. అప్పటినుండి అన్ని ఇండస్ట్రీలలో ఫిమేల్ ఆర్టిస్టులు, హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఆశా షైనీ(ఫ్లోరా) కూడా కాస్టింగ్ కౌచ్ తో పాటు పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న బాధాకరమైన విషయాలను గురించి మాట్లాడుతూ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.
తెలుగులో నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, సొంతం, 143 లాంటి సినిమాలతో పాటు ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసి గుర్తింపు సంపాదించుకున్న ఆశా షైనీ.. తమిళ, కన్నడ భాషలలో కూడా సినిమాలు చేసింది. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ, నటిగా చేతినిండా సినిమాలతో బిజీ లైఫ్ చూసింది. అలా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కన్నడ ప్రొడ్యూసర్ గౌరంగ్ దోషితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేసి.. వ్యక్తిగతంగా నరకయాతన అనుభవించానని చెబుతోంది ఈ బ్యూటీ. ఆ ప్రొడ్యూసర్ చేతిలో లైంగికంగా వేధింపులకు గురయ్యానని మొదటిసారి 2018లో మాట్లాడింది.
అప్పట్లో తన గురించి హ్యూమన్స్ ఆఫ్ బాంబే పోస్ట్ చేసిన కథనాన్ని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో రీపోస్ట్ చేసింది.ఆ వీడియోలో నిర్మాత గౌరంగ్ దోషితో 14 నెలలు తాను అనుభవించిన అబ్యూసివ్ రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది. 20 ఏళ్లకే కెరీర్ లో బిజీ అయిన తాను.. అతనితో రిలేషన్ షిప్ లో పడ్డాక అత్యంత దారుణమైన లైఫ్ చూశానని.. అప్పుడే తన కెరీర్ కూడా కోల్పోయానని వాపోయింది. అతన్ని కలిసిన కొన్ని రోజులకే నన్ను అసభ్యకరంగా తిడుతూ.. ఒంటిపై చెప్పుకోలేని చోట దాడి చేశాడని.. ఫోన్ లాక్కొని వేధించాడని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఫ్లోరా అలియాస్ ఆశా షైనీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆశా షైనీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.