బాపు బొమ్మ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే నటి దివ్యవాణి. చిన్న వయసులోనే సినిమాలోకి అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో సుమారు 50 సినిమాల వరకు చేశారు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లారు. తిరిగి వచ్చి మళ్లీ సినిమాల్లో చేయగా.. పేరు రాకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన ఆమె అనూహ్యంగా పార్టీ నుండి వైదొలిగారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో స్నేహ ద్వయం అంటే గుర్తుకు వచ్చేది బాపు-రమణలే. వీరి ప్రతి సినిమా చెక్కిన శిల్పం. బాపు గీత, రమణ రాత అంత ఫేమస్ మరీ. ఎన్ని తరాలు మారినా, ఎన్ని సినిమాలు వచ్చినా వీరి సినిమాలు అజరామరం. దర్శకుడు బాపు తన చేత్తో గీసే బొమ్మలు ఎన్ని భావాలు పలుకుతాయో ఆయన తెరమీద నటీనటులతో కూడా అన్ని హవాభావాలు పలికిస్తారు. అందులో ఒకటి పెళ్లి పుస్తకం. బాపు బొమ్మ అనగానే గుర్తుకు వచ్చేలా చేశారూ దివ్యవాణి. ఆమెను తప్ప మరొకరిని ఆ సినిమాలో ఊహించలేం. అంతలా ఒదిగిపోయారు ఆ క్యారెక్టర్‌లో. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసిన దివ్యవాణి, తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. పలు కారణాలతో పార్టీని వీడారు. ఇటీవల సుమన్ టివి ఇంటర్వ్యూలో పాల్గొన్నఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
దివ్యవాణి అసలు పేరు ఉషారాణి. ఆమెది గుంటూరు జిల్లా తెనాలి. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక సినిమాలో నటించిన ఆమె తర్వాత హీరోయిన్‌గా మారారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం సినిమాల్లో నటించారు. సినిమాలు చేస్తున్న సమయంలోనే వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని సినిమాలు చేశాక చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. తిరిగి మళ్లీ సినిమాలోకి వచ్చినప్పటికీ అంత ఫేమ్ రాలేదు. తర్వాత సీరియల్స్ లో కూడా నటించారు. ఆ తర్వాత రాజకీయాల మీద ఆసక్తితో టీడీపీలోకి వచ్చారు. అక్కడ ఫైర్ బ్రాండ్ గా మారారు. అనూహ్యంగా పార్టీ నుండి బయటకు వచ్చేశారు. దీనిపై స్పందిస్తూ .. పార్టీలో కొంత మంది వల్లే తాను బయటకు వచ్చేశానని తెలిపారు. ఇవన్నీ అధిష్టానానికి తెలియదని పేర్కొన్నారు. అధిష్టానం నుండి ఆమెకు ఏమీ కావాలంటే అవి ఇవ్వాలని చెప్పినా కానీ కొంత మంది నేతలు తనను అవమానించారని అన్నారు.
టీడీపీ నుండి బయటకు వచ్చేసే సమయంలో బాలకృష్ణ ఇంటికి వెళ్లానని, తనకు జరిగిన అవమానం గురించి కన్నీటి పర్యంతమయ్యారట. వేధించిన నాయకుల గురించి ఆయనకు చెప్పగా. నేను చూసుకుంటానని, వీటి గురించి ఇతరుల నుండి సమాచారం వచ్చిందని, మీరు బాధపడొద్దన్నారని తెలిపారు. అయితే తాను పార్టీ ఇక వీడక తప్పలేదని అన్నారు. ఆమె టీడీపీ నుండి బయటకు వచ్చే సమయంలో కొంత మంది విమర్శలు చేస్తూ కన్నీటి పర్యంతం అయిన సంగతి విదితమే. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ సినిమాలు అవసరమా అని కుటుంబ సభ్యులు అడిగారని తెలిపారు. తన కుమార్తె కూడా నువ్వెంటో తమకు తెలుసునని, బాధ పడొద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. తర్వాత దైవ చింతనలో గడుపుతున్నానని తెలిపారు. ఆమె ప్రస్తుతం ఆమె వైసీపీలోకి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దివ్యవాణి నచ్చిన సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.