తాజాగా వచ్చిన ఓ పాన్ ఇండియా సినిమాలో తనకు ఓ హీరోకు మధ్య జరిగిన చాలా సీన్స్ ను తొలగించినట్లు హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో అవకాశం రావడమే గొప్ప. ఇక రాక రాక అవకాశం వస్తే.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాలని చాలా మంది తారలకు ఉంటుంది. అయితే తాము నటించిన సీన్స్ ను అనుకోని కారణాలతో తొలగిస్తే ఆ బాధ వర్ణాణాతీతం. ఇలాంటి బాధనే తాను అనుభవించాను అని చెప్పుకొచ్చింది ఓ హీరోయిన్. తాజాగా ఓ పాన్ ఇండియా మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోతో చేసిన నా సీన్స్ చాలా వరకు తొలగించారు అని వాపోయింది. తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ భామ ఆ మూవీ విశేషాలతో పాటుగా పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.
మైఖేల్.. సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేశాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హీరోయిన్ దీప్శికా. విజయ్ సేతుపతికి జోడిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను విజయ్ సేతుపతితో కలిసి నటించిన చాలా సీన్స్ ను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
అయితే ఈ పాత్ర కోసం మెుదట వేరే హీరోయిన్ ను అప్రోచ్ అయ్యారని, ఆమె చివర్లో తప్పుకోవడంతో ఆ అవకాశం తనకు దక్కింది చెప్పుకొచ్చింది. డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పేటప్పుడు ఒకే ఒక్క లైన్ మాత్రమే చెప్పాడని, అది నాకు నచ్చడంతోనే ఈ సినిమాకు ఒప్పుకున్నానని దీప్శిక తెలిపింది. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతికి నాకు మధ్య చాలా సీన్స్ చిత్రీకరించారని, కానీ సినిమా లెంగ్త్ ను దృష్టిలో ఉంచుకుని ఆ సీన్స్ ను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం నాకు ఎంతో బాధ కలిగించిందని ఆమె చెప్పుకొచ్చింది.