ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ అరుదైన వ్యాధుల బారినపడి అనారోగ్యానికి గురయ్యారు. గతేడాది సమంత, హంసా నందిని, మమత మోహన్ దాస్.. లాంటి చాలామంది సెలబ్రిటీలు హాస్పిటల్స్ లో చేరి చికిత్స కూడా పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ బుల్లితెర నటి, తెలుగు హీరోయిన్ అరుదైన వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో తెలియజేసింది.
సెలబ్రిటీల ఆరోగ్యానికి సంబంధించి నెగటివ్ గా ఏదైనా అప్డేట్ తెలిసిందంటే చాలు.. వారికి ఎలాంటి ప్రమాదం లేదని, సేఫ్ గా కోలుకుంటున్నారని తెలిసే వరకు ఫ్యాన్స్ కంగారు పడిపోతుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ అరుదైన వ్యాధుల బారినపడి అనారోగ్యానికి గురయ్యారు. గతేడాది సమంత, హంసా నందిని, మమత మోహన్ దాస్.. లాంటి చాలామంది సెలబ్రిటీలు హాస్పిటల్స్ లో చేరి చికిత్స కూడా పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ బుల్లితెర నటి, తెలుగు హీరోయిన్ దెబీనా బోనర్జి అరుదైన వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో తెలియజేసింది.
దెబీనా బోనర్జికి.. ‘ఇన్ఫ్లుఎంజా బి’ అనే అరుదైన వైరస్ సోకిందట. ఈ వైరస్ సోకినవారు చిన్న పిల్లలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు తెలిపారట. రీసెంట్ గా తన భర్త పిల్లలతో కలిసి దెబీనా.. శ్రీలంక వెకేషన్ కి వెళ్ళింది. అక్కడినుండి తిరిగొచ్చాక.. మెడికల్ టెస్టులలో ఆమెకు ఇన్ఫ్లుఎంజా బి వైరస్ సోకినట్లు నిర్ధారించారు డాక్టర్స్. సో.. ఆమెను కొద్దిరోజులపాటు చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని సూచించారు. మొన్నటివరకూ నార్మల్ జలుబు, జ్వరం అనుకోని పెద్దగా పట్టించుకోలేదట. కానీ.. జ్వరం ఏమాత్రం తగ్గకపోవడంతో వెంటనే మెడికల్ టెస్టులు చేయించుకుందట.
ఈ క్రమంలో దెబీనాకి ఆ అరుదైన వైరస్ సోకిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని సోషల్ మీడియా పోస్టులో తెలిపింది దెబీనా. ఇదిలా ఉండగా.. దెబీనా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో అమ్మాయిలు అబ్బాయిలు, సిక్స్ అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రామాయణం సీరియల్ లో సీత క్యారెక్టర్ పోషించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పూర్తిగా హిందీ సీరియల్స్ లోనే కంటిన్యూ అయ్యింది. ఇక రామాయణంలో రాముడిగా నటించిన గురుమీత్ చౌదరిని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు.
Debina Bonnerjee pic.twitter.com/ckMTym0PXv
— Hardin (@hardintessa143) March 1, 2023