నటీమణుల విషయంలో కొంతమంది తోటి మగ నటుల ప్రవర్తనం సరిగా ఉండటం లేదు. లేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా ప్రవర్తించాలని చూస్తున్నారు. కొన్ని సార్లు వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో కొంతమంది నటీమణులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలోని ఆడవాళ్లపై వేధింపులు పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్నాయి. చిన్న చిన్న నటుల దగ్గరినుంచి.. టాప్ డైరెక్టర్లు, నిర్మాతల వరకు చాలా మంది ఆడవాళ్ల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. దేశం ఈ మూలనుంచి ఆ మూలవరకు ఇదే పరిస్థితి ఉంది. వేధింపులు తట్టుకోలేక కొంతమంది సినిమాలను వదిలేస్తుంటే.. మరికొంతమంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ నటి అంజలి నాయర్‌కూడా తనపై ప్రముఖ నటుడి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఆమె తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘‘ నేను నా మొదటి తమిళ సినిమా కోసం షూటింగ్ చేస్తూ ఉన్నాను. అందులోని విలన్ పాత్రధారుడు నాతో తప్పుగా ప్రవర్తించడానికి చూశాడు.
అతడు ఆ సినిమాకు సహ నిర్మాతగా కూడా ఉన్నాడు. అతడు నన్ను షూటింగ్ అయిపోయినా ఇంటికి పంపించేవాడు కాదు. నాతో పని లేకపోయినా అక్కడే ఉంచేవాడు. నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. నన్ను ప్రేమిస్తున్నానని అనే వాడు. ఓ రోజు నన్ను ట్రైన్‌లోంచి కిందకు తోసి చంపాలని చూశాడు. అంతేకాదు! పలు విధాలుగా అతడు వేధించేవాడు. దీంతో అతడి వేధింపులు తట్టుకోలేక పోలీసుల దగ్గరకు వెళ్లాను. అతడిపై కేసు పెట్టాను. ఇక్కడ ఉండలేక మళ్లీ కేరళకు వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, అంజలి నాయర్ 1994లో ‘మనదె వెళ్లితెరు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో వచ్చిన నమ్మల్ తమ్మి అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు.
నెల్లు సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. మలయాళం, తమిళంలో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె కలిసి పని చేశారు. ఇక, ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2011లో మలయాళ దర్శకుడు అనీశ్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు రావటంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె గత సంవత్సరం అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మరి, అంజలి నాయర్‌పై వేధింపులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.