సినీతారల నుండి కొత్త సినిమాల అప్ డేట్స్ మాత్రమే కాదు.. వారి పర్సనల్ లైఫ్ లో మొదలుపెట్టే కొత్త ప్రయాణాల గురించి సైతం తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి ముప్పై ఏళ్ళు దాటిన హీరోలు, హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ.. దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నారు. కాగా..
అభిమాన సినీతారల నుండి కొత్త సినిమాల అప్ డేట్స్ మాత్రమే కాదు.. వారి పర్సనల్ లైఫ్ లో మొదలుపెట్టే కొత్త ప్రయాణాల గురించి సైతం తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి ముప్పై ఏళ్ళు దాటిన హీరోలు, హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ.. దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నారు. కాగా.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కి సంబంధించి పెళ్లి వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. హీరోయిన్ అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటికీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది.
ప్రస్తుతం కెరీర్ లో బిజీగా ఉన్న అంజలి.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని సమాచారం. తెలుగుతో పాటు తమిళ భాషలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అంజలి.. కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ అవుతోంది. దీంతో ఓవైపు వచ్చిన అవకాశాలను అందుకుంటూనే.. మరోవైపు ఓటిటి సినిమాలు/వెబ్ సిరీస్ లు చేస్తుంది. అదీగాక ఈ మధ్య తనలోని బోల్డ్ యాంగిల్ ని సైతం బయటపెట్టి షాకిచ్చింది అమ్మడు. పైగా కథ డిమాండ్ బట్టి.. బోల్డ్ సీన్స్ చేసేందుకు తాను సిద్ధమేనని ఆ మధ్య తేల్చి చెప్పింది. దీంతో అంజలి బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా రెడీగానే ఉందని.. అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. ప్రెజెంట్ అంజలి RC15లో కీలకపాత్ర పోషిస్తోంది.
ఇదిలా ఉండగా.. కొత్తగా అంజలి పెళ్లి రూమర్స్ చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆల్రెడీ తన పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. అయితే.. అంజలి కోలీవుడ్ కి చెందిన ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని.. అతడినే పెళ్లి చేసుకోనుందని అప్పట్లో వార్తలు రాగా.. తాను ఎవరిని లవ్ చేయలేదని రూమర్స్ కి చెక్ పెట్టింది. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. అంజలి.. తన పేరెంట్స్ చూసిన అబ్బాయినే పెళ్లాడబోతోందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ.. అంజలి పెళ్లి చేసుకోబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంజలి వయసు 36. జూన్ 16 వస్తే.. 37కి చేరుతుంది. సో.. నలభైలో పడకముందే అంజలి పెళ్లి చేసుకుంటే మంచిదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి హీరోయిన్స్ లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Hello weekend 🫶🏻#weekendmood pic.twitter.com/3sWai7CyG7
— Anjali (@yoursanjali) March 4, 2023