ప్రేమికులకు అత్యంత ముఖ్యమైన రోజు ఏదన్నా ఉందంటే.. అది ప్రేమికుల రోజు మాత్రమే. ఈ రోజును ప్రేమికులు తమ జీవితంలో మరచిపోలేని రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనకు వాలెంటైన్స్ డే ఓ బ్లాక్ డే అంటోంది. కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్ర పరిశ్రమలో ప్రేమలకు, పెళ్లిళ్లకు, బ్రేకప్ లకు కొదవలేదు. నిన్న కలిసి తిరిగిన ప్రేమ జంట.. నేడు బ్రేకప్ చెప్పుకుని సింగిల్ అంటూ తిరుగుతున్నారు. ఇక ప్రేమికులకు అత్యంత ముఖ్యమైన రోజు ఏదన్నా ఉందంటే.. అది ప్రేమికుల రోజు మాత్రమే. ఈ రోజును ప్రేమికులు తమ జీవితంలో మరచిపోలేని రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనకు వాలెంటైన్స్ డే ఓ బ్లాక్ డే అంటూ.. బ్లాక్ డ్రెస్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకి ప్రేమికుల రోజును బ్లాక్ డే అని ఎందుకు అంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రియా.. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. తన నటనతో వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఆండ్రియా నటిగానే కాకుండా సింగర్ గా కూడా సక్సెస్ అయ్యింది. ఒక్క తమిళ సినిమాలే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఒకానొక దశలో తమిళంలో అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది ఈ యుగానికొక్కడు బ్యూటీ. అయితే తన జీవితంలో జరిగిన రెండు సంఘటనలను పంచుకుంటూ.. తనకు ప్రేమికుల రోజు ఓ బ్లాక్ డే అంటూ చెప్పకనే చెప్పింది.
ఈ వాలెంటైన్స్ డే నాకు బ్లాక్ డే అంటూ.. సింబాలిక్ గా బ్లాక్ డ్రెస్ లో దిగిన పిక్ ను తన సోషల్ మీడీయాలో షేర్ చేసింది ఆండ్రియా. అయితే తను ఈ విధంగా మారడానికి రెండు పెద్ద బ్రేకప్ లే కారణం అని తెలుస్తోంది. అవేంటంటే? గతంలో తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ తో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. కానీ అనిరుధ్ తనకంటే వయసులో చిన్నవాడు అనే కారణంతో ఆమె అతడి నుంచి దూరం అయ్యింది. ఇదే విషయాన్ని ఆండ్రియా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ బ్రేకప్ తర్వాత.. పెళ్లైన వ్యక్తితో రెండేళ్లు డేటింగ్ చేసింది. ఈ కాలంలో తాను శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులకు గురి అయినట్లు విడిపోయిన తర్వాత వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఈ రెండు బ్రేకప్ ల తర్వాత ఆండ్రియా మానసికంగా కుంగిపోయింది. ఈ వేదన నుంచి బయటపడటానికి ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఈ రెండు కారణాల కారణంగానే తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందని తెలుస్తోంది. అందుకే ఈ ప్రేమికుల రోజును ఇలా సెలబ్రేట్ చేసుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆండ్రియా పిశాచి 2 చిత్రంలో నటిస్తోంది. మరి ప్రేమికుల రోజును బ్లాక్ డేగా చెప్తున్న ఆండ్రియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.