చైనాలోని వుహాన్ నుంచి పుట్టుకు వచ్చిన మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. గత ఏడాది కరోనా కాటుకు ప్రజలు విల విలలాడిపోయారు.. పిట్టల్లా రాలిపోయారు. దీని ప్రభావం ఇంకా కొనసాగుతుంది.. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది కరోనా భయంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటికే పరిమితం అయ్యారు.
సాధారణంగా సెలబ్రెటీలు ఎక్కువగా వెకేషన్ ని ఇతర దేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలకు మాల్దీవులు అంటే తెగ ఇష్టం. ఇక కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అందాల ముద్దుగుమ్మలు వెకేషన్ కోసం మాల్దీవుల బాట పడుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చాలా మంది భామలు మాల్దీవులు అందాలని తనివితీరా ఆస్వాదించేందుకు వెళ్లారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే కుమార్తె.. హీరోయిన్ అనన్య పాండే సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తాజాగా మాల్దీవుల్లో లైగర్ బ్యూటీ అనన్య పాండే రచ్చ చేస్తుంది. ఫొటో షూట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది.
ఈ బ్యూటీ బికినీ అందాలు చూస్తుంటే కుర్రాళ్ల మతులు పోతున్నాయి. తాజాగా ఈ అమ్మడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటుండగా, ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘లైగర్’చిత్రంతో విజయ్ దేవరకొండ చాలా స్పెషల్ గా పొడవాటి జుట్టుతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.