పూరీ జగన్నాథ్ ని ఇంకా 'లైగర్' నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఆ సినిమాతో నష్టపోయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు. ఇంతకీ వాళ్లంతా ఎందుకు మరోసారి ఇలా చేశారో తెలుసా?
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని లైగర్ కష్టాలు అస్సలు వదలట్లేదు. గతేడాది ఆగస్టులో ఆ సినిమా వచ్చి వెళ్లిపోయింది గానీ.. దాని ఎఫెక్ట్ మాత్రం ఇంకా అతడిని వెంటాడుతూనే ఉంది. కొన్నాళ్ల ముందు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నా చేస్తే ఏదో శాంతింపజేశారు కానీ ఇప్పుడు మరోసారి వాళ్లు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. తమకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఇప్పుడు ఎందుకు మళ్లీ ధర్నాకు దిగారు?
అసలు విషయానికొచ్చేస్తే.. తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ చాలా స్పెషల్. తన సినిమాలతో అదిరిపోయే బ్రాండ్ క్రియేట్ చేశాడు. కొన్నేళ్లపాటు వరస ఫ్లాఫ్స్ తో డీలా పడిపోయాడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో కాస్త కోలుకున్నట్లు కనిపించాడు కానీ ‘లైగర్’తో ఆ వచ్చిన పేరు మొత్తం పోగొట్టేసుకున్నాడు. రిలీజ్ కి ముందు ఈ మూవీ ఆహా ఓహో అని నానా హంగామా చేశారు. అదంతా కూడా ఒట్టి మాటలే అని రిలీజ్ తర్వాత అందరికీ అర్థమైపోయింది. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నామని అనుకున్నారు కానీ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేశారు. దీంతో కనీసం వసూళ్లు లేక బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.
అయితే ‘లైగర్’ సినిమాని కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లందరూ ఘోరంగా నష్టపోయారు. ఇప్పుడు వాళ్లందరూ కలిసి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు మరోసారి ధర్నాకు దిగారు. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు రూ.9 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పితే మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారా అంటే.. ఈ సోమవారం(మే 15) పూరీ జగన్నాథ్ తన కొత్త సినిమాని లాంచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో రామ్ హీరోగా నటించబోతున్నాడు. అందుకే ‘లైగర్’తో నష్టపోయినవాళ్లు ఇప్పుడు ధర్నాకు దిగినట్లు సమాచారం. మరి పూరీ జగన్నాథ్ ‘లైగర్’ కష్టాలు ఇప్పటికీ వదలకపోవడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Puri Jagan’s new movie is set to be announced coming Monday but the #LIGER troubles seem to be not over yet.
Exhibitors & Leasers Association started protesting at Film Chamber today to get compensation for losses. pic.twitter.com/BvwCxAgjiV
— Aakashavaani (@TheAakashavaani) May 12, 2023