ఈ మద్య బాలీవుడ్ లో కొంత మంది సెలెబ్రెటీలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆ మద్య స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నటి స్వర భాస్కర్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమెను చంపుతామని ఓ లేఖ వచ్చింది.. వెంటనే అలర్ట్ అయిన స్వరభాస్కర్ ముంబైలోని వెర్సోవా పోలీసులను ఆశ్రయించింది. స్వర భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇండస్ట్రీలో స్వర భాస్కర్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతుంటారు. 2017 లో వీర సవార్కర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. 2019 లో వీర సవార్కర్ పిరికివాడని పేర్కొంటూ ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఆ సమయంలో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విధంగా ఆమె వీర సవార్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ వచ్చి ఉండవొచ్చని అనుకుంటున్నారు.
స్వర భాస్కర్ కి వచ్చిన లేఖ హిందీలో భాషలో ఉందని.. అంతేకాదు ఆ లేఖలో స్వర భాస్కర్ ని అసభ్య పదజాలం దో దూషించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక లేఖ చివరిలో ఇట్లు ఈ దేశ యువత అని కూడా రాసి ఉన్నట్లు పేర్కొన్నారు. స్వర భాస్కర్ ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులపై నాన్-కాగ్నిసబుల్ నేరం నమోదు చేసాము అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Despicable and utterly condemnable.. The perpetrators should be dealt with promptly and strictly, as per law! Heinous crime.. Unjustifiable!
As one often says.. if you want to kill in the name of your God, start with yourself!
Sick sick monsters! #UdaipurHorror https://t.co/bvf5T2sr0l— Swara Bhasker (@ReallySwara) June 28, 2022