తెలుగు చిత్రపరిశ్రమలో దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారు ఎనలేని కీర్తిని, అభిమానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఆయన చేసిన సినిమాలు.. ఇండస్ట్రీ పెద్దగా ఆయన చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. తెలుగు ఇండస్ట్రీలో దాసరి గారి తర్వాత.. ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ సమస్యలను గురించి చర్చించేవారు తగ్గిపోయారు. భారీ బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ నష్టమొస్తే డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను ఆదుకోవడానికి దాసరి గారి తర్వాత ఇప్పటికీ ఎవరు ముందుకు రావడం లేదని సీనియర్ నటుడు సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన సుమన్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఆవేదన చెందారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణ లోపించిందని.. షూటింగ్స్ లో సమయపాలన అసలు కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఫిలిం మేకర్స్ కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. కానీ ఎవరూ బయ్యర్ల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు.
ఈరోజుల్లో సినిమాలను నమ్మకంతో కొనుగోలు చేసే బయ్యర్లు, సినిమా ఫ్లాప్ అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. సినిమా రిలీజయ్యాక బయ్యర్ల పరిస్థితి గురించి ఆలోచించేవాళ్లే లేరు. అప్పట్లో దాసరి నారాయణరావు గారు బయ్యర్ల గురించి ఆలోచించేవారు. ఒక సినిమా పోతే, ఆ తర్వాత సినిమాను ఉచితంగా చేసి బయ్యర్లను ఆదుకునేవారని సుమన్ తెలిపారు. ఇండస్ట్రీలో ఇప్పుడా పరిస్థితి లేదని, మేకర్స్ కారణంగానే బయ్యర్లు సంతోషంగా ఉండడం లేదని వాపోయారు. ప్రస్తుతం నటుడు సుమన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. మరి సుమన్ మాటలపై ,మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.