ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. రవికిషన్ సోదరుడు రమేష్ కిషన్ కొంత కాలంగా క్యాన్సర్ లో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన సోదరుడు మృతిచెందినట్లు రవి కిషన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు.
రవి కిషన్ ను ఓదారుస్తూ పలువురు ప్రముఖులు రమేష్ కిషన్ సంతాపం తెలియజేశారు. మరాటీ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించిన రవి కిషన్ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఆయన నటుడు మాత్రమే కాదు.. యూపీ గోరఖ్పుర్ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీగా గెలుపొందారు. రవి కిషన్ కి ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఇక రమేశ్ కిషన్ పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
दुःखद समाचार..!
आज मेरे बड़े भाई श्री रमेश शुक्ला जी का एम्स हॉस्पिटल दिल्ली में दुःखद निधन हो गया है l
बहुत कोशिश किया पर बड़े भईया को नहीं बचा सका, पिता जी के बाद बड़े भाई का जाना पीड़ा दायक
महादेव आपको अपने श्री चरणों में स्थान प्रदान करें l
कोटि कोटि नमन l
ओम शांति 🙏 pic.twitter.com/1EZr2vD6Hs— Ravi Kishan (@ravikishann) March 30, 2022