తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున నటించిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క. తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత అనుష్క అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి కూడా లేడీ ఓరియెంట్ చిత్రాలు భాగమతి, నిశ్శబ్దం. తాజాగా అనుష్క ఫ్యామిలీ గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అనుష్క సోదరుడు గుణరంజన్ శెట్టి గ్యాంగ్ స్టర్స్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: Manchu Vishnu: మంచు విష్ణు కొత్త మూవీ టైటిల్ పై వివాదం!
గతంలో మాఫియా నేరగాడు ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్‌శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. ముత్తప్ప రై మరణించిన తర్వాత ఈ ఇద్దరూ విభేదాలతో ప్రత్యర్థులుగా మారారు. ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం గుణ రంజన్ విభేదాల కారణంగా బయటకి వచ్చేశాడు. ఆ తర్వాత గుణ రంజన్ సొంతంగా జయ కర్ణాటక జనపర వేదికని స్థాపించారు. మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్విత్ రై అసూయతో.. గుణ రంజన్ ని హత్య చేసేందుకు ముత్తరప్పై కుట్ర చేస్తున్నారని.. ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఆర్టీసీ షాక్.. భారీగా పెరిగిన బస్ పాస్ ఛార్జీలు!
ఈ క్రమంలో ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు తాను ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నానని.. తనకు ఎలాంటి సంబంధం లేదని మన్విత్ రై అంటున్నారు. తన సోదరుడి భద్రత కోసం అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి. అనుష్కకి ఇద్దరు సోదరులు.. ఒకరు గుణ రంజన్ కాగా మరొకరు సాయి రమేష్. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.