Brother: అమ్మలోని ‘అ’ను, నాన్నలోని ‘న్న’ను కలిపితే అన్న. తల్లి,తండ్రుల్లోని ప్రేమను ఏకకాలంలో రుచి చూపించగల ఓకే ఒక్క రక్త సంబంధం ‘అన్న’. చెల్లెలికి కష్టం కలిగితే తాను తల్లడిల్లిపోయే.. కన్నీళ్లు పెట్టుకునే అన్నలు లేకపోలేరు. చెల్లెలి మనసును, ఆమె ఆలోచనల్ని అర్థం చేసుకునే గుణం అన్నకు మాత్రమే ఉంటుంది. పెదవి తెరిచి ఇది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు! చెప్పకుండానే ఆమె గుండెలోతుల్లోని బాధను అర్థం చేసుకోగలడు. అందుకు పరిష్కారం కూడా ఆలోచించగలడు. తన చేతనైందైనా కాకపోయినా.. కష్టం అయినా నష్టం అయినా.. ఏడు సముద్రాల అవతల ఉన్న దాన్ని కూడా చెల్లెలి ముఖంలో సంతోషం చూడటం కోసం తెచ్చివ్వగలడు. అంతేకాదు! కొంతమంది అన్నలు చెల్లెలి సుఖం కోసం తమ ప్రాణాలను సైతం సంతోషంగా బలిచ్చేస్తారు. నాన్నకు ప్రతిరూపమైన అలాంటి అన్న తన చెల్లెలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగుపెట్టబోతుంటే ఆమె కంట నీరు చూడగలడా?.. చూల్లేడు. అందుకే! తన చెల్లెలి సంతోషం కోసం ఓ అన్న చేసిన గొప్ప ప్రయత్నం.. చెల్లెలిపై అన్న చూపిన అన్‌కండిషనల్ లవ్‌కు చిరునామా.. ఈ మధార్థ ఘటన..
అంగరంగ వైభవంగా ఓ పెళ్లి జరుగుతోంది. పెళ్లికొడుకు చుట్టాలు, పెళ్లికూతరు తరపు చుట్టాలు, తల్లిదండ్రులు, పిల్లలతో పెళ్లిమండపం సందడిగా ఉంది. డ్యాన్సులు, ఆటలు.. పాటలతో అందరూ హుషారుగా ఉన్నారు. పెళ్లికూతురు సంతోషంగా మెడలో తాళి కట్టించుకుంది. కానీ, ఆమె మనసులో మాత్రం ఏదో తీరని లోటు. పెళ్లిపందిలో ఒకరు లేరనే ఆలోచన. మనసులోని బాధను బయటికి కనిపించకుండా దాచుకుంది. తనలోనే కాదు.. అందరిలోనూ అదే ఆవేదన. చెల్లి.. బాధను అర్థం చేసుకున్నాడు ఆ అన్న. నాన్నలో సగమైన తాను.. చెల్లికి ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే, చెల్లి పెళ్లికి నాన్నని అనుకోని అతిథిలా తీసుకొచ్చాడు. చెల్లి కళ్లలో ఆనందం చూసేందుకు ఆమెను సర్‌ప్రైజ్ చేశాడు. తండ్రి మైనపు బొమ్మతో.. చెల్లినే కాదు.. తల్లిని కూడా ఆశ్చర్యపరిచాడు.
పెళ్లిమండపంలో నాన్నను చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడ్చేసింది. పెళ్లికి నాన్నలేడని తన గుండెలో దాచుకున్న బాధను ఒక్కసారిగా.. ఆనంద భాష్పాల రూపంలో వెల్లబుచ్చింది. లేడనుకున్న నాన్న, తన పెళ్లికి రాడనుకున్న నాన్న.. పెళ్లికి వచ్చి తనని ఆశీర్వదించడంతో ఎగిరిగంతేసింది. తండ్రిని పట్టుకుని.. ఏడ్చేసింది. తన బాధను చూసి దేవుడే నాన్నను పంపాడని, గట్టిగా పట్టుకుని ఎమోషనల్ అయ్యింది. పెళ్లికూతరే కాదు.. అక్కడ ఉన్న ప్రతి ఒకరు ఎమోషనల్ అయ్యారు. పెళ్లికూతురి తల్లి తన భర్త విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. కూతురి పెళ్లిలో భర్త లేడనే ఆవేదన తీరడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కాదు పెళ్లిమండపంలోని ప్రతిఒకరు ఎమోషనల్ అయ్యారు. విగ్రహాన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు.
మా కోసం మళ్లీ తిరిగొచ్చావా అంటూ ఎమోషనల్ అయ్యారు. సదరు అన్న ఆ చెల్లెలికి ఇచ్చింది కేవలం పెళ్లి గిఫ్ట్ మాత్రమే కాదు! అంతకు మించిన తండ్రి ప్రేమను. ఇక, ఆస్తి కోసం తోడ బుట్టిన వాళ్లను పరాయి వాళ్లుగా చూస్తున్న ఈ రోజుల్లో.. స్వార్థం కోసం రక్త సంబంధాలను బలి తీసుకుంటున్న ఈ రోజుల్లో.. ఆ అన్న తన చెల్లెలి బాధను తీర్చడానికి పరితపించిన విధానం అద్భుతం. నాన్న తర్వాత నాన్న స్థానంలో ఉండి పెళ్లి జరిపిస్తున్నా.. కొత్త జీవితంలో అడుగుపెడుతున్న చెల్లెలికి నాన్న లేని లోటు లేకుండా చేయాలనుకోవటం.. చనిపోయిన తండ్రిని మైనపు విగ్రహం రూపంలో పెళ్లికి రప్పించటం అందరి మనసును గెలుచుకుంటోంది. సామాన్య ప్రజలనుంచి సెలెబ్రిటీల వరకు ఆ అన్నపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి, రక్త సంబంధానికి ప్రతీకగా నిలిచిన సదరు అన్నపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Brother Gift: కూతురి పెళ్లికి తిరిగొచ్చిన చనిపోయిన తండ్రి.. మండపం మొత్తం సంతోషాలు..