గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ బాలీవుడ్ సింగీత దర్శకుడు బప్పీ లహిరి కన్నుమూసిన విషాదం మరువక ముందే ప్రముఖ నటుడు కొట్టాయం ప్రదీప్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన 61 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో కేరళలో చనిపోయారు. ఆయనకు భార్య మాయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన మలయాళం, తమిళంతో పాటు తెలుగులో నూ అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఏం మాయ చేశావే’మూవీలోనూ నటించారు. జార్జ్ అంకుల్ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. 40 ఏండ్ల వయసులో ప్రదీప్ తన కెరీర్ ను ప్రారంభించాడు. మొదట్లో సినిమాల్లో కామెడీ పాత్రలు పోషించాడు.
2001 నుంచి ఇప్పటి వరకు 70 సినిమాల్లో నటించాడు. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘కుంజిరామాయణం’, ‘ఆడు ఒరు భీగర జీవి ఆను’, ‘వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు’, ‘కట్టపనయిలే రిత్విక్ రోషన్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాల ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొట్టాయం ప్రదీప్ మరణ వార్త విన్న నటుడు ‘పృథ్వీరాజ్ సుకుమారన్ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికన ఆయనకు అంతిమ నివాళ్లులు అర్పించారు. ప్రదీప్ నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కొట్టాయం ప్రదీప్ ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Rest in peace! #KottayamPradeep 🙏 pic.twitter.com/zUHU2GflqH
— Prithviraj Sukumaran (@PrithviOfficial) February 17, 2022