వాలంటైన్స్ డే రోజు తెలుగు నటుడు నవదీప్ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరిగిందన్నట్లు ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
ఈ మధ్య సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు చాలామంది.. పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు త్వరలో మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు నటీనటుల రిలేషన్ లో ఉన్నారంట రూమర్స్ కూడా వస్తున్నాయి. వాటిపై సదరు యాక్టర్స్ స్పందిస్తే గానీ అసలు విషయం తెలీదు. అయితే తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా నటుడు నవదీప్ పోస్ట్ మాత్రం అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే అమ్మాయి ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉన్న ఫొటో చూడగానే అందరూ షాకయ్యారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలు ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నారు. నవంబరులో నాగశౌర్య పెళ్లి చేసుకోగా, రీసెంట్ గా శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలో ప్రభాస్ నుంచి కూడా గుడ్ న్యూస్ రానుందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే.. తాజాగా నవదీప్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది. అందులో ఖుషీ అహుజా అనే అమ్మాయిని ట్యాగ్ చేసి, ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేశాడు. వాలంటైన్స్ డే రోజు సరిగ్గా ఇలాంటి పోస్ట్ పెట్టేసరికి అందరూ నవదీప్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అనుకున్నారు.
కానీ అందరినీ ప్రాంక్ చేసేందుకు నవదీప్ అలా చేసినట్లు తెలిసింది. దీంతో అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు. ఇకపోతే టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్, విలన్ గా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశాడు. బిగ్ బాస్ తొలి సీజన్ లోనూ పాల్గొని ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. ప్రస్తుతం ‘లవ్ మౌళి’ అనే సినిమాతో పాటు ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేశాడు. ఈ రెండు కూడా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే.. ఎంగేజ్ మెంట్ అంటూ నవదీప్ ప్రాంక్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.