ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా మారు మోగుతోన్న పేర్లు నరేష్, పవిత్రా లోకేష్. వీరి రిలేషన్, మూడో భార్యతో నరేష్ గొడవలు తెగ వైరలయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరూ మళ్లీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
నరేష్-పవిత్రా లోకేష్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఈ జంట పేరు విపరీతంగా మారు మోగిపోయింది. కొన్నాళ్ల పాటు వీరిద్దరూ ట్రెండింగ్‌లో నిలిచారు. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని వీరిద్దరూ మీడియా ముందే అంగీకరించారు. ఇక వీరిద్దరి రిలేషన్‌పై, నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. మీడియాకెక్కింది రమ్య రఘుపతి. కర్ణాటకలో కూడా వీరి మీద పలు సంచలన ఆరోపణలు చేసింది. అటు నరేష్ కూడా.. రమ్య రఘుపతి మీద సంచలన ఆరోపణలు చేశాడు. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ వివాదం సద్దుమణగక ముందే.. మరో సంచలనంతో తెర మీదకు వచ్చాడు నరేష్. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా.. మళ్లీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం నరేష్.. విడిపోయి.. పవిత్రా లోకేష్‌తో కలిసి ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా సరే.. వీరిద్దరూ కలిసి జంటగా హాజరవుతున్నారు. దీంతో మీడియా అటెన్షన్ మొత్తం వీరి మీదనే ఉంటుంది. అలాంటిది వీరిద్దరూ జంటగా మళ్లీ పెళ్లి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో.. మరోసారి ఈ జంట ట్రెండింగ్‌లోకి వచ్చింది. మళ్లీ పెళ్లి చిత్రం విడుదల నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల స్పీడు పెంచారు. మే 26న తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మీడియా వాళ్లు.. నరేష్‌ను ఉద్దేశించి.. మీకు, పవిత్రా లోకేష్‌కు పెళ్లైందా అని సూటిగా ప్రశ్నించారు. ఇందుకు బదులుగా నరేష్ మాట్లాడుతూ ‘‘ఇదొక బోల్డ్ ఐడియా. మన వివాహ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో ‘మళ్ళీ పెళ్లి’ సినిమాను తీశాం. ఇప్పటికే కొంత మందికి ఈ చిత్రాన్ని చూపించాం. సినిమా బావుందని అన్నారు. అనుమానం, వ్యక్తుల మధ్య నమ్మకం లేకపోవటం, అనుబంధాలు లేకపోవటం వంటి కారణాలతో వివాహ వ్యవస్థ డెబ్బతింటోంది’’ అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు.
‘‘ఎవరి మీదనో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నేను ‘మళ్ళీ పెళ్లి’ సినిమా తీశానంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎందకు తీయాలి. ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పెడితే సరిపోతుంది కదా. లేదు అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఎవరి ఇల్లు అయినా ప్రమాదంలో కూలిపోయిందనుకోండి.. బాధపడుతూ కూర్చుంటామా.. లేక మళ్లీ ఇల్లు కట్టుకుంటామా. అలానే మా జీవితం తలకిందులైంది. దాన్ని మేం ఎవరికీ చెప్పలేదు. కానీ చెప్పినప్పుడే సమస్యలు వచ్చాయి. నాకు, పవిత్రకు మధ్య మంచి బాండింగ్ ఉంది. మా మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలనిపిస్తే అందరికీ చెప్పే చేసుకుంటాం. ఇద్దరు మనసులు కలిసినప్పుడు వారిద్దరూ కలిసి ఉండొచ్చునని కోర్టు కూడా చెప్పింది’’ అని ఇన్‌డైరెక్ట్‌గా తాము రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు నరేష్.
మూడో భార్య రమ్యా రఘుపతితో ఉన్న విభేదాలు గురించి నరేష్ మాట్లాడుతూ.. ‘‘ఓ వ్యక్తి కారణంగా నా జీవితంలో తలనొప్పులు వచ్చాయి. నాకు ఆ వ్యక్తి పేరు చెప్పటం ఇష్టం లేదు. ఇప్పుడు నేను విడాలకు అప్లయ్ చేశాను. ఆ వ్యక్తి నా పరువుకు భంగం కలిగించాలని, మా ఇద్దరినీ నాశనం చేయాలని ప్రయత్నించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే.. పవిత్రా లోకేష్ నన్ను నమ్మి వచ్చింది. నా ప్రాణం ఉన్నంత వరకు ఆమెను కాపాడతాను. అందుకనే ఆమెకు అండగా నిలబడుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు నరేష్. పైగా తమ బంధానికి కుటుంబం నుంచి మద్దతు ఉందని చెప్పుకొచ్చాడు. మరి నరేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.