నేచురల్ స్టార్ నాని 'దసరా' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును అందుకుని.. రూ. 100 కోట్లకు పరుగులు తీస్తోంది. కానీ నాని మాత్రం హ్యాపీగా లేనట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన దసరా మూవీ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. కేవలం రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును అందుకుని.. రూ. 100 కోట్లకు పరుగులు తీస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను నాని తన భుజాలపై వేసుకుని చేసిన సంగతి మనకు తెలిసిందే. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్ సహా పలు భాషల్లో విడుదలైంది దసరా. తెలుగులో బ్లాక్ బాస్టర్ టాక్ తో, వసూళ్లతో దుసుకెళ్తోంది. కానీ నాని మాత్రం హ్యాపీగా లేనట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా.. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో థియేటర్ల దగ్గర దూసుకుపోతోంది. విడుదలైన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది దసరా మూవీ. దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు తొలి చిత్రమే అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ గా దసరా మూవీని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో నాని ఊర మాస్ యాక్టింగ్ మరో లెవల్ అనే చెప్పాలి. కాగా ఇప్పటికే లాభాల బాట పట్టింది దసరా మూవీ. అయితే సినిమా సక్సెస్ అయినా గానీ నాని మాత్రం సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. అదేంటి సినిమా సక్సెస్ అయితే నాని సంతోషంగా లేడంటున్నారని మీకు అనుమానం రావొచ్చు. నాని సంతోషంగా లేడు అనడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే?
తెలుగులో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దసరా మూవీ ఇతర భాషల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో వచ్చిన ఓపెనింగ్స్ ను మాత్రం ఇతర భాషల్లో రాబట్టలేకపోయింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం.. కర్ణాటకలో 4 రోజుల కలెక్షన్స్ రూ. 6.2 కోట్లు కాగా.. తమిళ నాడులో రూ. 1.45, కేరళలో రూ. 0.57 కోట్లుగా వసూళ్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. రూ. 4.83 కోట్లుగా వసూలు అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటూ తెలుగులో వచ్చిన వసూళ్ల కంటే ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో నాని ఈ విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దసరా ప్రమోషన్స్ ను తన భుజాన వేసుకుని నాని ఒక్కడే ఈ రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేసుకున్నాడు. అయితే రోజు రోజుకు దసరా మూవీపై ప్రేక్షకులల్లో ఆసక్తి పెరుగుతుండటంతో.. రాబోయే రోజుల్లో బాలీవుడ్ తో పాటుగా ఇతర ఇండస్ట్రీల్లో కూడా కలెక్షన్లు పుంజుకుంటాయని సినీ పండితులు భావిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే నాని సంతోషంగా లేడని తెలుస్తోంది.