బుల్లితెర మీద యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికి.. వెండి తెర మీద మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. గుంటూరు టాకీస్ సినిమా ఒక్కటే ఆమె ఖాతాలోని హిట్ సినిమా. ప్రస్తుతం బుల్లితెర మీద శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే.. నందుతో కలిసి బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించింది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరో నందు.. రష్మీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రష్మీ లేకపోతే ఈ సినిమా లేదని.. తనకు జీవితమే లేదంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. ‘‘అందరూ ఓ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రష్మీకి ఆ అవసరం లేదు. తాను క్వీన్ ఆఫ్ టెలివిజన్‌గా మారింది. ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు నాకు ముందు గుర్తుకు వచ్చింది రష్మీనే. తనను ఒప్పించడం కోసం ఓ రోజు స్టార్ బక్స్‌కు పిలిచాను. తాను కథ కూడా వినలేదు. వెంటనే ఓకే చెప్పేసేంది. రష్మీ ముఖం చూపించి ఈ సినిమాను అమ్మేయొచ్చు అని భావించే తనను కలిశాను. నా మీద, నా ఫ్రెండ్‌షిప్ మీద గౌరవంతో రష్మీ ఓకే చెప్పింది. ఆ రోజు తాను ఆ సినిమా అంగీకరించకపోతే.. ఈ సినిమా ఉండేది కాదు.. నా జీవితం ఇలా ఉండేది కాదు’’ అని చెప్పుకొచ్చాడు నందు.
‘‘ఇక సినిమా తీసేటప్పుడు 40-50 మందిమి కలిసి అచ్యుతాపురంలో ఒకటే రూమ్‌లో ఉండేవాళ్లం. నా బాధ చూసి.. రష్మి ఇక తట్టుకోలేక మా ఇల్లు.. ఇక్కడికి చాలా దగ్గర.. వచ్చి మా ఇంట్లో ఉండ్రా అన్నది. వాళ్ల అమ్మ రాత్రింబవళ్లు నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నాకు వండి పెట్టి ఎంతో బాగా చూసుకున్నారు. ఆమె రుణం ఎన్నటికి తీర్చుకోలేను. ఆమెకు కాళ్లకు దండం పెట్టినా తప్పు లేదు. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం రష్మీని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చింది. ఆటోలో తిప్పినా ఏం ఫీలవ్వలేదు. ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఫ్రెండ్ కోసం తాను అంత చేస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘అలాంటిది తనకు, నాకు మధ్య ఏదో ఉందని చండాలమైన రాతలు రాస్తున్నారు. తప్పు భయ్యా. తను లేకపోతే ఈ సినిమా లేదు.. ఇక్కడి దాకా రాలేకపోయేవాళ్లం.. నాకు జీవితమే లేదు’’ అంటూ నందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజ్ మీదే రష్మికి దండం పెట్టాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
RR